Diwali Celebrations 2024 : రాక్షసత్వాన్ని అంతమొందించినందుకు గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజ మాసం బహుళ అమవాస్య రోజు జరుపుకునే ఈ వేడుక దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారంతా. ధన త్రయోదశి to భాయ్ దూజ్ వరకూ మొత్తం ఐదు రోజుల పండుగలో ఏ రోజు ఏం చేస్తారు.. ఆరోజుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం..
Dai 1 - ధన త్రయోదశి ( Dhanteras 2024)
ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశి. ఈ రోజు బంగారు ఆభరణాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు. ఈ రోజు బంగారం, వెండ కొనుగోలు చేయడాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు ఇదేనని ఈ రోజు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్టే అని భావిస్తారు. ఆరోగ్యాన్నిచ్చే ధన్వంతరీ పూజ కూడా ఈ రోజు చేస్తారు.
Also Read: భారతదేశంలో వివిధ ప్రాంతాలలో దీపావళిని ఎలా జరుపుకుంటారు - దాన ధర్మాల్లో భాగంగా ఏమిస్తారు!
Dai 2 -నరక చతుర్దశి (Naraka Chathurdasi 2024)
ధన త్రయోదళి తర్వాత రోజు దీపావళికి ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశి నరక చతుర్థశిగా జరుపుకుంటారు. గతేడాది లానే ఈ ఏడాది కూడా నరక చతుర్ధశి, దీపావళి ఒకే రోజు వచ్చాయి. సూర్యోదయం సమయానికి నరక చతుర్థశి ఉంటే సూర్యాస్తమయం సమయానికి అమావాస్య ఉంది. దీంతో రెండు పండుగలు ఒకేరోజు జరుపుకుంటారు. ఈ రోజు నువ్వులనూనె రాసుకుని తలంటు పోసుకుంటే జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
Dai 3 -దీపావళి అమావాస్య (Diwali 2024)
ఆశ్వయుజ మాసం ఆఖరి రోజు..కార్తీకమాసం ప్రారంభానికి ముందు రోజు దీపావళి జరుపుకుంటారు. ఉదయం నుంచి వివిధ రకాల వంటల తయారీ, ఇంటి అలంకరణలో ఉంటారు. సూర్యాస్తమయం సమయానికి ఘనంగా లక్ష్మీపూజ చేసుకుని ఇల్లంతా దీపాలు వెలిగిస్తారు. అనంతరం సీట్స్ పంచుకుని బాణసంచా వెలిగిస్తారు. దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుని భావిస్తారు.
Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!
Dai 4 - బలి పాడ్యమి (Balipratipada 2024)
దీపావళి అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమిని బలిపాడ్యమి అంటారు. ఈ రోజు నుంచే కార్తీకమాసం ప్రారంభం. పాతాళం నుంచి బలిచక్రవర్తి భూమ్మీదకు వస్తాడంటారు. గుజరాతీలకు ఈ రోజు ఉగాది. శ్రీ కృష్ణుడు గోవర్థనగిరి ఎత్తి రేపల్లె ప్రజల్ని కాపాడిన రోజు కూడా ఇదే.
Dai 5 - భాయ్ దూజ్ యమ విదియ ( Bhai Dooj / Yama Dwitiya 2024)
దీపావళి అమావాస్య మర్నాడు బలపాడ్యమి అయితే.. ఆ తర్వాత రోజు యమ విదియ. దీనినే ఉత్తరాదిన భాయ్ దూజ్ గా జరుపుకుంటారు. ఇంకా చెప్పాలంటే పురాణాల్లో రాఖీ పండుగ ఇది అని చెప్పుకోవచ్చు. కార్తీకమాసంలో రెండో రోజు వచ్చే ఈ రోజున యముడు స్వయంగా తన సోదరి ఇంటికెళ్లి భోజనం చేసి దీవెనలు అందించాడు. సోదరీ, సోదరుల మధ్య ఆప్యాయతకు ఆదర్శం భాయ్ దూజ్. దీనినే భగనీహస్త భోజనం అని కూడా అంటారు.
Also Read: ధన త్రయోదశి రోజు బంగారం కొనాలా - ఈ రోజుకున్న విశిష్టత ఏంటి?
మొత్తం 5 రోజుల పాటూ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఆయా ప్రాంతాలను బట్టి అనుసరించే పద్ధతులలో మార్పులుంటాయి.