Diwali 2024 How Diwali Celebrated in Different Parts of India :  దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకుంటే పండుగలలో దీపావళి ఒకటి. చీకటిని తొలగించి వెలుగులు పంచే ఈ పండుగ మానవాళికి  మంచి మార్గాన్ని చూపిస్తుందని విశ్వశిస్తారు. సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందం అన్నీ కలగలపే ఈ వేడుకలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు. ధన్వంతరీ ఆరాధన, కుబేర పూజ, లక్ష్మీపూజ, బాణసంచా వెలుగులు ఇవన్నీ కామన్ గా అనుసరించే పద్ధతులే అయినా మిగిలిన సంప్రదాయాల్లో చిన్న చిన్న మార్పులుంటాయి  


ఉత్తర భారతదేశం


ఉత్తర భారతదేశంలోని హిందువులకు దీపావళి అంటే.. 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు సీతా,లక్ష్మణుడి సమేతంగా అయోధ్యకు వచ్చిన రోజుగా భావిస్తారు. ఆరోజు అమావాస్య కావడంతో రాజ్యం మొత్తం బాణసంచా వెలుగులతో నింపేసి ఘనంగా స్వాగతం పలికారని చెబుతారు.  ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, బీహార్ మరియు పొరుగు ప్రాంతాలలో  భారీగా బాణసంచా కాల్చే సంప్రదాయం  ఇప్పటికీ కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ,   పంజాబ్‌లలో అందమైన ముగ్గులు వేసి దీపాలతో అలంకరిస్తారు. లక్ష్మీపూజ చేసి మిఠాయిలు పంచుకుంటారు.  ఈ ప్రాంతాల్లో  సిక్కులు దీపావళి జరుపుకోపోయినా ఇల్లంతా దీపాల వెలుగులతో నింపేస్తారు.  ఆరోగ్యం ,  శ్రేయస్సు కోసం భగవంతుడు ధన్వంతరిని, లక్ష్మీ దేవిని ప్రార్థిస్తారు. నిరుపేదలకు దుప్పట్లు, బట్టలు, ఆహారాన్ని పంచిపెడతారు.  


Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!


గుజరాత్‌


గుజరాత్‌లో దీపావళి రోజు పాటించే పవిత్రమైన ఆచారం ఏంటంటే ఓ దిపాన్ని నేతితో వెలిగిస్తారు. రాత్రంతా దాన్నుంచి వచ్చే పొగను , పొడిని సేకరించి కాటుక తయారీకి ఉపయోగిస్తారు. ఇలా చేస్తే ఏడాది పొడవునా శ్రేయస్సు ఉంటుందని విశ్వసిస్తారు. 


ఒడిశా


ఒడిశాలోని హిందువులు దీపావళి రోజు పూర్వీకులను తలుచుకుంటారు. ఇక్కడ కొత్త వెంచర్లు, ఆస్తుల కొనుగోలు, కార్యాలయాలు , దుకాణాలు తెరవడం ఈ రోజు శుభప్రదంగా భావిస్తారు.  


బెంగాల్‌


బెంగాల్‌లో దీపావళి రోజు కూడా కాళీని, గణేషుడిని పూజిస్తారు. తూర్పు భారతదేశంలో, దీపాలు వెలిగించడం, కొవ్వొత్తులు, దియాలు వెలిగించడం, బాణసంచా పేల్చడం లాంటి ఆచారాలు అలాగే ఉంటాయి. ఇక్కడ అర్థరాత్రి కాళీ పూజలు చేస్తారు. దీపావళి రోజు అర్థరాత్రి పూర్వీకుల ఆత్మలు స్వర్గానికి చేరుకుంటాని విశ్వసిస్తారు. ఇందులో భాగంగా స్వర్గానికి దారిచూపిస్తూ పొడవాటి స్తంభాలపై దీపాలు వెలిగిస్తారు


Also Read: ధన త్రయోదశి రోజు బంగారం కొనాలా - ఈ రోజుకున్న విశిష్టత ఏంటి?


మహారాష్ట్ర 


మహారాష్ట్రలోని హిందువులు నాలుగు రోజుల పాటు దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. తల్లి-బిడ్డ మధ్య ప్రేమకు సూచనగా ధన త్రయోదశి రోజు ఆవు-దూడలను పూజిస్తారు.  ఈ రోజు కుబేరుడిని పూజిస్తారు. పశువుల దాణా ,  ధాన్యాలను విరాళంగా ఇస్తారు. పేదలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. నరకచతుర్థశి రోజు ఒళ్లంతా నూనె రాసుకుని అభ్యంగన స్నానం ఆచరించి ఆలయానలను సందర్శిస్తారు. అనంతరం రుచికరమైన వంటలు, స్వీట్స్ తయారు చేస్తారు. దీపావళి రోజు లక్ష్మీ పూజ ఘనంగా నిర్వహిస్తారు. 


దక్షిణ భారతదేశం


తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటకలలో.. ధనత్రయోదశి రోజు ప్రజలంతా యమ భగవానుడికి ప్రార్థనలు చేస్తారు .   ఆహారం, బట్టలు , విద్యా సామగ్రిని దానం చేస్తారు. అనాథాశ్రమాలు ,  దేవాలయాలకు విరాళాలు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో... శ్రీకృష్ణుడు సత్యభామ నరకసంహారం చేసినందుకు ఆనందంగా దీపావళి జరుపుకుంటారు. కర్ణాటక, కేరళలో బలిపాడ్యమిని అంటే దీపావళి మర్నాడు ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు.  


Also Read: ధనత్రయోదశి రోజు బుధుడి రాశిపరివర్తనం - లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ రాశులవారికి అన్నీ శుభాలే!


నారాయణ్ సేవా సంస్థాన్


రాజస్థాన్‌ ఉదయపూర్‌లో ఉన్న ఒక లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ నారాయణ్ సేవా సంస్థాన్. మతం, ప్రాంతం, కులం , లింగ వివక్ష లేకుండా పోలియో బాధిత వ్యక్తుల చికిత్సతో పాటూ పునరావాస రంగంలో దాతృత్వ సేవలను అందిస్తోంది. దీనిని 23 అక్టోబర్ 1985న  కైలాష్ అగర్వాల్ స్థాపించారు. ఈ సంస్థకి దేశవ్యాప్తంగా 480 శాఖలతో పాటూ ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో 49 శాఖలున్నాయి. ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా సేవ చేయాలని భావించేవారు ఈ సంస్థకు భారీగా విరాళాలు ఇస్తుంటారు.