Ammayi garu Serial Today Episode దీపక్, విజయాంబిక బయట వీడియో గురించి మాట్లాడుకుంటారు. మనం రూపని ఇబ్బంది పెడదామనుకుంటే రూప మనల్ని ఇరకాటంలో పెట్టేసిందని విజయాంబిక అంటుంది. ఇంతలో రూప వచ్చి తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడి తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడని షాక్ అయ్యారా మీ లాంటి వాళ్లకి మాటలతో ఇచ్చే షాకులు సరిపోవని కానీ కరెంట్ షాక్ ఇచ్చి చంపేయాలని అంటుంది.
రూప: నువ్వు మా నాన్నకి చూపించాలనుకున్న వీడియోలో బూతు ఏం లేదు. నేను నా మొగుడి ఇంటికి వెళ్లాను నా అత్తయ్యని అమ్మని కలిశాను. అదే నేను పంపించిన వీడియోలో ఉంది అంతా బూతు పురాణమే. బంగారం లాంటి భార్య మందారం ఉండగా మీ ఇద్దరికీ ఓ కొడుకు ఉండగా మరో అమ్మాయిని తల్లిని చేశావు అంటే నీది ఓ జన్మేనా. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి. మందారానికి తెలిస్తే ఆలోచించండి.
విజయాంబిక: రేయ్ నువ్వు చేసిన వెధవ పనుల వలన జీవితాంతం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎలక్షన్‌లో మీ మామయ్య ఓడిపోయిన తర్వాత మనకి పదవి దక్కినంత వరకు ఓపిక పట్టు.
రూప అత్తింట్లో జరిగిన తంతు గుర్తు చేసుకొని సంతోషంగా ఉంటుంది. ఇంతలో రాజు కాల్ చేస్తాడు. ఇంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు కదా అని అడుగుతాడు. అంతా ఓకే అని చెప్పిన రూప రేపు ప్రచారం మీ ఏరియాలోనే అని చెప్తుంది. ప్రచారానికి అత్తయ్య, అమ్మని తీసుకురమ్మని చెప్తుంది. దాంతో రాజు పెద్దయ్యగారిని ప్రచారం పేరుతో ఇంటికి తీసుకురమ్మని అంటాడు. రూప సరే అంటుంది. ఇక ఉదయం సూర్యప్రతాప్, రూప, విజయాంబిక అందరూ ప్రచారానికి వెళ్తారు. రాజు వాళ్ల ఇంటి దగ్గర్లోనే ఉంటారు. రూప తన తండ్రిని తీసుకొని వస్తానని అంటుంది. ఇక మరోవైపు జీవన్ కూడా ప్రచారం చేస్తాడు. రూప సూర్యప్రతాప్తో నాన్న రాజు వాళ్లు ఇంటిని మర్చిపోయారని అంటుంది. దానికి సూర్యప్రతాప్ అవసరం లేదని అంటాడు. రూప మాత్రం ఒక్క ఓటుతో రాజకీయ ప్రస్థానం మారిపోతుంది అలాంటిది ఆ ఇంట్లో ఏడు ఓట్లు ఉన్నాయి వదులుకోవద్దని అంటుంది. దానికి చంద్ర కూడా రూపకి సపోర్ట్ చేస్తాడు. విజయాంబిక అడ్డుపడుతుంది. కానీ రూప మాత్రం ఒప్పించి తీసుకెళ్తుంది.
అప్పలనాయుడు, ముత్యాలు ఎదురెళ్లి దండాలు పెట్టి మీకు ప్రచారం అవసరం లేదు పెద్దయ్యగారు మీ పేరుకే ఓట్లు వేసేస్తారని అంటారు. ఇక ముత్యాలు అమ్మగారు హారతి తీసుకురండి అని చెప్తే విరూపాక్షి హారతి తీసుకొని వస్తుంది. సూర్యప్రతాప్ విరూపాక్షిని చూసి షాక్ అవుతుంది. విరూపాక్షిని చూసి విజయాంబిక తమ్ముడూ ఈ ఇంట్లో ఉండి నాటకాలు ఆడిస్తుంది ఈవిడేనా అని అంటుంది. ఇక విరూపాక్షి భర్తకి హారతి ఇస్తుంది. ఇంతలో జీవన్ వచ్చి ఎలక్షన్ కోసం బాగానే డ్రామాలు ఆడుతున్నారని 20 ఏళ్లగా అసహ్యించుకుంటున్న ముఖాన్ని ఎలక్షన్ల కోసం ముద్దాడుతున్నారని అంటాడు. ఇక జీవన్ సూర్యప్రతాప్ ఇంటి సమస్యల్ని అక్కడ ప్రచారం చేస్తాడు. 20 ఏళ్లకు పైగా భార్యని వదిలేశాడని కూతుర్ని అత్తారింటికి పంపడం లేదని అక్క మొగుడిని ఇంటికి రానివ్వడం లేదని సూర్యప్రతాప్‌కి ఆడవాళ్లు అంటే మర్యాద లేదని ప్రచారం చేస్తారు. దానికి విరూపాక్షి సూర్య గురించి ఇంకొక్క మాట మాట్లాడితే బాగోదని సూర్య నన్ను వదిలేయలేదని సూర్య నుంచి నేనే వచ్చేశానని అంటుంది. ఇన్నేళ్లు భర్తకి దూరంగా ఉన్నా భర్త కోసమే ఉంటున్నాను అంటే ఆయన చూపించిన ప్రేమ అలాంటింది అంటుంది.
రూప: కూతురి అల్లుడిని దూరం చేశాడు అంటున్నారు కదా మరి ఆ అల్లుడు ఎవరో తెలుసా మా నాన్న హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయన దగ్గర పీఏగా పని చేసిన రాజు. పీఏని నేను పెళ్లి చేసుకున్నా ఏం అనలేదు కానీ నాన్నకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఆయన అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం.
అప్పలనాయుడు: వాళ్ల అక్కకి అన్యాయం చేశారని అంటున్నారు కదా కానీ పెద్దయ్య గారు అక్క ఏమైపోతుందో అని తన ఇంట్లో అక్కని అమ్మస్థానంలో ఉంచి చూసుకుంటున్నారు. ఇంత కంటే మహానుభావుడు ఉంటాడా. ఇంత కంటే ఆడవాళ్లని గౌరవించే వాళ్లు ఉంటారా.ఈ జీవన్ వెనకున్న వాళ్లంతా గుంటనక్కలే.
సూర్యప్రతాప్: తప్పు చేస్తే ఇంట్లో వాళ్లనే శిక్షించే పెద్దయ్య సీఎం అయితే రాష్ట్రంలో తప్పు చేసే వారిని వదులుతారా. వీడు జైలు కెళ్లి బెయిల్ మీద వచ్చి ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి వాడు ప్రజలకు ఏం చేస్తాడు. విరూపాక్షి సూర్యప్రతాప్‌కి హారతి ఇస్తుంది. అందరూ సంతోషిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.