Trinayani Serial Today Episode అద్దంలో చూసిన సీన్‌కి నయని ఏడుస్తూ గాయత్రీ పాపని తీసుకొని వెళ్లిపోతుంది. అందరూ నయని అద్దంలో వేరే ఎవరినో చూసి భయపడిందని అనుకుంటారు. గదిలో నయని పాపని పట్టుకొని ఏడుస్తుంది. విశాల్ అక్కడికి వెళ్లి నువ్వు ఏడుస్తుంటే నా గుండె పగిలిపోతుంది నయని అని చెప్తాడు. నువ్వు అద్ధంలో ఏం చూశావ్ నయని అని అడుగుతాడు.
నయని: నన్ను నేను చూసుకున్నాను బాబుగారు. ఆలోచనలో పడ్డాను. ఆవేధన పడ్డాను. నేను ఏమైపోతానా అనుకొని బాధ పడ్డాను.
విశాల్: నయని నీకు ఆపద వస్తే నువ్వు గ్రహించలేవు ఇదే నిజం.
విశాలాక్షి: అదే నిజం. ఏంటమ్మా నీ కష్టానికి కన్నీళ్లకు నేనే కారణం అని నా మీద నింద వేస్తావా ఏంటి.
విశాల్: నయని అలా అనదు కానీ ఏం జరిగిందా అని మేం టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం నవ్వుతూ కులాశాగా ఉండటం నాకు నచ్చడం లేదమ్మా.
విశాలాక్షి: అయ్యో నాన్న నాది నవ్వు ముఖం నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను.
నయని: నాకు ఏడుపు వస్తుందంటే నీకు మాత్రం నవ్వు ఉంది కదా విశాలాక్షి.
విశాలాక్షి: అమ్మా నా మీద నీకు చిరు కోపం ఉందని తెలుస్తుంది కానీ నేను నీకు పరోక్షంగా సాయం చేశానమ్మా. అది నువ్వు గానీ ఇంట్లో ఉన్న వాళ్లు గానీ ఎవరూ గ్రహించడం లేదు. ఆలోచించడం లేదు.
విశాల్: అమ్మా తల్లీ నువ్వు పేరుకు తగ్గట్టు విశాలాక్షి అమ్మవారే అనుకుంటాం కానీ దయచేసి నయనిని ఏం ఆలోచించమని చెప్పొద్దు.
విశాలాక్షి: నాన్న అమ్మకి అన్నీ తెలుసు. జరగబోయేది తెలుసుకునే అమ్మ ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడటం లేదని అనిపిస్తుంది.
నయని: విశాలాక్షి నేను ఒకటి అడుగుతా చెప్పు నేను అద్దంలో నాకు నేను చూసుకున్నా అద్దంలో వేరే చీరలో కనిపించానేంటి?
విశాల్: అదేంటి నయని ప్రతిబింబం అంటే అచ్చుగుద్దినట్లు ఉండాలి కదా.
విశాలాక్షి: పోలిస్తే అలా ఉంటుంది. పోలిక అలా ఉంటుంది. పోల్చి చూస్తే తెలుస్తుంది. నువ్వు చీరని మాత్రం చూస్తే తెలీదమ్మా గమనించి చూస్తే నీకే అర్థమవుతుంది.
గదిలో తిలోత్తమ ఆలోచిస్తూ ఉంటుంది. వల్లభ తల్లి దగ్గరకు వస్తాడు. నయనిని బెంబేలెత్తించినట్లు చేసింది విశాలాక్షి కాదని అది నయని దృష్టి అని నయని ఏం చూసిందో అదే తనకు కంగారు పెట్టించిందని తిలోత్తమ అంటుంది. నయని తన చావు అంచులు చూసుంటుందని తిలోత్తమ కొడుకుతో చెప్తుంది. ఇళ్లాలు కన్నీళ్లు పెట్టుకొని భర్తని కౌగిలించుకుంది అంటే అది తను చనిపోతాను అని తెలిసినప్పుడే అని అంటుంది. నయని ఆందోళనను మనం వాడుకోవాలని అంటుంది. అందరూ హాల్‌లోకి వస్తారు. హాసిని నయనిని యమపాశం ఎందుకు వెంబడిస్తుందని చెప్పావ్ అలా ఎలా చెప్పావని అడుగుతుంది విశాలాక్షిని.
దానికి విశాలాక్షి విధి ఆడే వింత నాటకం అని విశాలాక్షి అంటుంది. దానికి హాసిని నయనికి గండం ఏంటని అడుగుతుంది. అందరూ నయనితో నీకు ఏం కనిపించిందో చెప్పమని అడుగుతారు. దానికి నయని నేనే కనిపించానని అంటుంది. దానికి విశాలాక్షి మరి నువ్వు వేరే చీరలో ఎందుకు కనిపించావని అడుగుతుంది. నయనికి గండం లేదని చెప్పమని విక్రాంత్ విశాలాక్షికి అడిగితే అబద్దం చెప్పలేను అంటుంది. దాంతో నయని చూశారా నాకే గండం వస్తుందని నేను చెప్పానని అంటుంది. ఇక విశాలాక్షి ఎవరి వల్ల గండం వస్తుందో తెలుసుకునే అవకాశం ఉందని చెప్తుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: పండు దగ్గర మాట తీసుకున్న లక్ష్మీ.. యమున సహస్రకి మాటిస్తుందా!