Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా లక్ష్మీకి అయిష్టంగానే ఖడ్గం ఇస్తుంది. అరవింద వాళ్లు సంతోషిస్తారు. ఇక అందరూ ఖడ్గం తీసుకొని ఊరేగింపుతో గుడి దగ్గరకు వెళ్తారు. రౌడీలు లక్ష్మీ వాళ్లు రావడం చూస్తారు. రెండు టార్గెట్‌లు మిత్ర, ఖడ్గమని రెడీగా ఉండాలని చెప్తాడు. ప్లాన్ ఏంటి అని మరో రౌడీ అడిగితే మూడు గ్రూపులగా విడిపోదామని ఇద్దరూ వాళ్ల ముందు పులుల వేషం వేసుకోవాలని బాంబులు మరో ఇద్దరూ వేయాలని అందరూ చెల్లా చెదురు అయిపోతే నేను ఖడ్గం తీసుకొస్తా పులి వేషంలో ఉన్న వాళ్లు మిత్రను తీసుకురావాలని అందరూ ఏమైందో తెలుసుకునేలోపు మిత్ర, ఖడ్గంతో పారిపోవాలి అంటాడు. 


 లక్ష్మీ ఖడ్గం తీసుకొని అమ్మవారి దగ్గరకు వస్తుంది. పంతులు ఊరి జనం అందరి సాక్షిగా అమ్మవారి పూజ చేస్తారు. అందరూ దండం పెట్టుకుంటారు. ఖడ్గం అమ్మవారి దగ్గర పెడతారు. లక్ష్మీ చుట్టూ అనుమానంగా ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. ఇంతలో మిత్రకు ఫోన్ వస్తుంది. మాట్లాడుతూ మిత్ర బయటకు వెళ్లాడు. అది చూసిన లక్ష్మీ వెనకాలే వెళ్తుంది. మనీషా కూడా డౌట్ వచ్చి చూస్తుంది. ఇక లక్ష్మీ మిత్ర వెనకాలే నిల్చొడం మిత్ర చూసి ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావ్ అని అడుగుతాడు. 


లక్ష్మీ: మీకు ప్రమాదం పొంచి ఉందని నాకు అనిపిస్తుంది. ఈ విషయం మీకు చెప్పకూడదు అనుకున్నా.
మిత్ర: నువ్వేమైనా నా బాడీ గార్డ్‌వా. 
లక్ష్మీ: మీ భార్యని.
మిత్ర: నన్ను నేను కాపాడుకోగలను. నువ్వు ఇలాంటివి చేస్తే నిన్ను పొగిడేస్తా అనుకోకు. నువ్వు ఎప్పటికీ నా భార్యవి కాలేవు.
మనీషా: ఏంటి లక్ష్మీ మిత్రతో తిట్లు తిననిదే నీకు రోజు గడవదా అయినా మిత్రతో నువ్వు నా భార్యవి కాదు అని ఎన్ని సార్లు అనిపించుకుంటావ్. సిగ్గు లేకుండా సింపథీతో బతికేస్తున్నావ్ నీది ఓ జన్మేనా, నువ్వు ఆడ జాతికి అవమానం. ఖడ్గం మిస్ అయినా మిత్రను మిస్ అవ్వను. నెస్ట్ ఇయర్ మిత్ర భార్యగా నందన్ వంశ కోడలిగా ఈ ఊరిలో అడుగుపెడతా. ఖడ్గం తీసుకొస్తా.
లక్ష్మీ: అయిపోయిందా ఇంకా ఉందా. వింటున్నా కదా అని చెప్పేస్తున్నావ్ నేను ఓపికగా ఉన్నంత వరకే నీ ఒళ్లు ఒలిచేస్తా. అందరి ముందు కొడితే చస్తావని వదిలేస్తున్నా. మళ్లీ మళ్లీ నా జోలికి రావొద్దు. నా విశ్వరూపం చూస్తే తట్టుకోలేవ్. ఖడ్గం నాదే మిత్ర నావాడే నందన్‌ వంశం నాదే ఏదీ వదిలిపెట్టను. 


మరోవైపు అందరూ అమ్మవారి త్రిశూలం ముందు కోరికలు కోరుకొని గాజులు వేస్తారు. వివేక్, జాను కూడా వేయాలని అనుకుంటారు. దేవయాని అది చూస్తుంది. వివేక్ తన కోరిక కోరుకొని గాజు వేయగానే అది పడుతుంది. ఏం కోరుకున్నావ్ అని జాను అడిగితే ఈ ఏడు జంటగా వచ్చిన మనం వచ్చే ఏడాది పాప బాబుతో రావాలని అంటాడు. దానికి జాను అది జరగాలి అంటే మీ అమ్మ ఒప్పుకోవాలి అంటుంది. ఇక వివేక్ అమ్మ ఒప్పుకోవాలి అని నువ్వు కోరుకొని వేయమని అంటాడు. దాంతో జాను అత్త తమ పెళ్లికి అంగీకారం తెలపాలని కోరుకొని గాజు వేస్తుంది. మొదటి గాజు పక్కన పడిపోతుంది. అది చూసిన దేవయాని దాని కోరిక నెరవేరదని అనుకుంటుంది. జాను రెండో గాజు వేయగా అది కూడా పక్కన పడిపోతుంది. జాను డిసప్పాయింట్ అయిపోతుంది. ఇక జాను ఏడుస్తూ చివరి గాజు వేయడానికి రెడీ అయితే దేవయాని చూసి అది పడకుండా చేయాలని దేవయాని జానుని తోసేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: పండు దగ్గర మాట తీసుకున్న లక్ష్మీ.. యమున సహస్రకి మాటిస్తుందా!