Trinayani Serial Today Episode నయని, విశాల్, గాయత్రీ పాప బయట ఉంటే తిలోత్తమ, వల్లభ యమపాశం తీసుకొని వస్తారు. యమపాశం ముందు నయని దగ్గరకు వచ్చి తర్వాత గాయత్రీ పాప దగ్గరకు యమపాశం వెళ్లింది అంటే అర్థమేమనుకున్నారు అని వల్లభ అడుగుతాడు. పాప వల్ల తల్లికి ప్రాణ గండం ఉంది అందుకే అలా అయ్యిందని చెప్తాడు. నయని షాక్ అయి ఏ బిడ్డా తల్లి మరణాన్ని కోరుకోదు కదా అని అంటుంది. 


వల్లభ: ప్రభావం కోరచ్చు కదా. శని అంటారు కదా.
విశాల్: అన్నయ్య నువ్వు ఎవర్ని అన్నా నేను ఊరుకుంటాను కానీ గాయత్రీ పాపని అంటే ఊరుకోను.
వల్లభ: ఎందుకు తమ్మీ నీకు ఈ పిల్ల అంటే అంత మమకారం.  పుట్టిన వెంటనే కన్న కూతుర్ని పోగొట్టుకున్నావ్. దత్తత తీసుకున్న ఈ గుడి ప్రసాదం తీసుకున్న పిల్ల ఎక్కువైందా.
విశాల్: షట్ అప్.


నయని వదిలేయమని విశాల్‌ని తీసుకెళ్తుండగా గాయత్రీ పాప వల్లభ చేతిలో ఉన్న పాశాన్ని తాకుతుంది. దాంతో వల్లభ కరెంట్ షాక్‌తో కింద పడిపోతాడు. దాంతో నయని వాళ్లు వస్తారు. ఇక పాప మళ్లీ యమపాశం మీద కాలు పెట్టడంతో షాక్ పోతుంది. సుమన విక్రాంత్ దగ్గరకు వెళ్లి షాక్ గురించి చెప్తుంది. యమపాశం వల్లే వల్లభకు ఇలా అయిందని అంటుంది. విక్రాంత్ దానికి పాపి చిరాయువు అంటారు కదా అలా మా అన్నకి ఏం కాదని అంటాడు. మీతో మాట్లాడితే నా ఆయుష్షు పోతుందని సుమన ఇరిటేట్ అయి వెళ్లిపోతుంది. 


ఉదయం అందరూ చక్కగా రెడీ అయి హాల్‌లోకి వస్తారు. విశాలాక్షి కూడా చక్కగా రెడీ అయి వస్తుంది. ఇక హాసిని, దురంధర అమ్మవారి గుడికి వెళ్లారని అంటాడు విక్రాంత్. ఇక విశాలాక్షి తన చేతిలో తాంబూలం పళ్లెం తీసుకొని వచ్చి నయని అమ్మ పండగ పూట వాయినం ఇస్తుందని అందుకే తీసుకొని వచ్చానని అంటుంది. సుమన, తిలోత్తమలు చీర బాలేదు, ఆస్తి ఇవ్వడం లేదు అని వాయినం తీసుకోమని అంటారు. దాంతో విశాలాక్షి మీరు ముఖం చాటేస్తున్నారు కానీ ఈ వాయినం నయని అమ్మ మీకు ఇవ్వడం లేదని అంటుంది. ఇక్కడ మేం ఇద్దరమే ఉన్నాం ఎవరికి ఇస్తుందని అంటారు.


వల్లభ: కొంప తీసి పాపకి ఇస్తుందా ఏంటి.
విశాలాక్షి: గాయత్రీ పాపకి కాదు పాపని చూసుకోబోయే వాళ్లకి ఇవ్వాలి అంటున్నాను. 
విశాల్: పాపని నేను నయని కంటి రెప్పలా చూసుకుంటాం కదమ్మా.
విశాలాక్షి: అయ్యో నాన్న మనవుల జీవితాలు రెప్పపాటులో ముగిసిపోతాయి. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. ఈరోజు ఒకరు ఉంటే రేపు మరొకరు ఉండరు.
నయని: నిజమే కానీ ఇక్కడ నేను తప్ప గాయత్రీని మరెవరు చూసుకుంటారు.
విశాలాక్షి: వాళ్లమ్మ చూసుకుంటారేమో.
తిలోత్తమ: ఏంట్రా తేడాగా మాట్లాడుతుంది.
పావనా: శాస్త్రి గారి కూతురు శారద మళ్లీ పుడుతుందేమో.
విశాలాక్షి: మీకు చెప్తే అర్థం కావడం లేదు కదా ఈ చీర తీసుకునే ఆమెను చూపిస్తా. 
పావనా: గాయత్రీ పాప అమ్మనా.
విశాలాక్షి: అవును. 
పావనా: అమ్మా ఆవిడ లేదు కదా.
విశాలాక్షి: గుండెల మీద చేయి వేసుకొని చెప్పు సోదరా గాయత్రీ కన్న తల్లి లేదా.
పావనా: మనసులో గాయత్రీ పాప కన్న తల్లి నయనినే కదా లేదు అని ఎలా చెప్పేది.
విశాల్: ఇవన్నీ కాదు నయనితో విశాలాక్షి అన్నట్లు ఆ వాయినం ఇప్పిద్దాం.
తిలోత్తమ: ఎవరికి ఇప్పిస్తాం గాయత్రీ పాప కన్న తల్లి ప్రమాదంలో చనిపోయింది కదా.


నయని వాయినం తీసుకుంటుంది. గాయత్రీని చూసుకునే ఆమె ఎక్కడుందని అడుగుతుంది. దానికి విశాలాక్షి దారి వైపు చూపిస్తుంది. ఎవరికీ అక్కడేం కనిపించదు. ఎవరూ లేరు కదా అని విక్రాంత్ అంటాడు. దానికి నయనిని విశాలాక్షి వెళ్లమంటుంది. నయని చూస్తుందని అంటుంది. నయని ముందుకు వెళ్తుంది. నయని వెళ్లి అద్దం తప్ప ఇంకేం లేదు అంటుంది. అద్దం వైపు చూడమని అప్పుడు నయనికి తెలుస్తుందని విశాలాక్షి అంటుంది. నయని అద్దం ముందుకు వెళ్లి చూస్తే అందులో నయని బొమ్మ నవ్వుతున్నట్లు కనిపిస్తుంది. నయని షాక్ అయిపోయి తాంబూలం పడేస్తుంది.


అందరూ దగ్గరకు రాబోతే నయని అందర్ని అక్కడే ఆగమని అంటుంది. నయని ఆ బింబాన్ని చూసి ఎవరు నువ్వు అని అడుగుతుంది. పాపని చూసుకోవడానికి నువ్వు ఎలా వస్తావ్ అని అంటుంది. ఇక నయని ఆ బింబాన్ని తాకబోతే అద్దం విరిగిపోతుంది. పగిలిన ముక్కల్లో నయని మళ్లీ ముఖాన్ని చూసి దాని మీద చీర కప్పేస్తుంది. విశాల్‌ని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. గాయత్రీ పాపని తీసుకొని పరుగున వెళ్లిపోతుంది. అందరూ ఏమైందో అర్థం కాక ఫీలవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: నయని వైపు దూసుకొచ్చిన యమపాశం.. మధ్యలో గాయత్రీ పాప దగ్గర యూ టర్న్.. చనిపోయేది ఎవరు?