Satyabhama Serial Today Episode దసరా పండగ కోసం క్రిష్ గుమ్మానికి పూల దండలు కడుతుంతాడు. సత్య గులాబి రేకులు పళ్లెంలో తీసుకురావడం చూసి సత్య వచ్చినప్పుడే కావాలని పడిపోయినట్లు చేసి సత్య పట్టుకునేలా చేస్తాడు. ఇక సత్య చేతిలో పళ్లెం విసిరేసి తమ మీద పూల రేకులు పడేలా రొమాంటిక్ సీన్ క్రియేట్ చేస్తాడు. సత్యకి ముద్దు ఇవ్వమని అడుగుతాడు. క్రిష్ ఇవ్వను అంటే సత్య క్రిష్‌ బలవంతంగా తీసుకోబోతే సత్య మామయ్య వచ్చాడు అంటే కంగారు పడతాడు. ఇక అక్కడ ఎవరూ లేకపోవడంతో సత్య నవ్వుతుంది. తర్వాత క్రిష్ సత్యని దగ్గరగా తీసుకుంటే ఈ సారి నిజంగానే భైరవి, మహదేవయ్య వస్తారు. సత్య చెప్పినా క్రిష్ వినడు ఇంతలో భైరవి ఏం చేస్తున్నావ్‌రా అని చివాట్లు పెడుతుంది. అప్పుడే నందిని, హర్ష వస్తారు. అందరూ సంతోషిస్తారు. 


భైరవి: ఎట్లా ఉన్నావే.
నందిని: అత్తింట్లో ఉన్నా కదా హ్యాపీగానే ఉన్నా.
మహదేవయ్య: నిన్ను ఆ ఇంటికి పంపిందే నేను కదా ఇలా రా బిడ్డ. సత్య సైగ చేయడంతో వెళ్తుంది. ఇంతలో జయమ్మ వస్తుంది.
జయమ్మ: ఇప్పుడు ఇంటికి కల వచ్చిందే వస్తావో రావో అని బెంగగా ఉండేది.
నందిని: చిన్న అన్న పిలిచాడు కదా రాకుండా ఎలా ఉంటాను.
భైరవి: నేను పెలిచేదాన్ని కానీ నా ఫొన్ ఎత్తడం లేదు కదా అందుకే చిన్నాతో పిలిపించా.
నందిని: ప్రేమగా మాట్లాడితే ఎందుకు ఎత్తను. నా అత్తారింటి గురించి ఎంక్వైరీ చేస్తావ్ అందుకే ఎత్తను. పెద్దొదినా ఎలా ఉన్నావ్ సీమంతంలో హంగామా చేద్దాం అనుకున్నా కానీ ఇలా అవుతుంది అనుకోలేదు.
భైరవి: ఎవరి దురదృష్టానికి ఎవరు ఏం చేస్తారులే.
నందిని: ఇది ఎవరు చేసిన పనో అంత తెలీకుండా లేనులే. 
రుద్ర: నా దిక్కు చూస్తున్నావేంటే.
నందిని: ఎందుకో తెలీదా.
రుద్ర: ఇదిగో చూడు పిండి వంటలు తిని బుద్ధిగా చీరాసారె పెట్టించుకొని వెళ్లిపో. ఎక్కువ తక్కువ మాట్లాడకు.
క్రిష్: అన్నా. పద్ధతిగా మాట్లాడు.
రుద్ర: అది పద్ధతిగా మాట్లాడుతుందా.. ఎవరు పిలవమన్నారురా దీన్ని. 
నందిని: ఇది నీ ఒక్కడి ఇళ్లే కాదు మా చిన్నన్నది కూడా బాపు వాడికి చెప్పు. 



గొడవని ఆపి బొమ్మల కొలువు చేసుకోవడానికి అందరూ లోపలికి వెళ్తారు. మహదేవయ్య, సత్య ఇద్దరూ బయటే ఉంటారు. ఇంట్లో చిచ్చు పెట్టాలి అని నువ్వు ఎంత ప్రయత్నించినా అని ప్రయత్నం దగ్గరే ఆగిపోతుందని చూశావా కోడలి కానీ కోడలా అంటాడు మహదేవయ్య. దానికి సత్య రోజులు లెక్క పెట్టుకోండి మీ బాణం మీ మీదకే ఎక్కు పెడతా. హ్యాపీ దసరా అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు మైత్రి ఇళ్లంతా హర్ష కోసం వెతుకుతుంది. నందినితో అత్తారింటికి వెళ్లారని విశాలాక్షి వాళ్లు చెప్తారు. ఇక విశాలాక్షి వాళ్లు గుడికి వెళ్తారు. బామ్మ తప్ప ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మైత్రి హర్ష గదిలోకి వెళ్తుంది. హర్ష, నందినిల ఫొటో చూసి నీ పక్కన నేను ఉండాల్సింది నాకు చాలా నష్టం జరిగింది హర్ష అని అనుకుంటుంది. ఇక ఓ షర్ట్ తీసుకొని ఇది నేనే నీ కోసం సెలక్ట్ చేశా హర్ష అనుకొని ఆ షర్ట్ వేసుకొని నువ్వు నాకు కావాలి హర్ష నువ్వు లేకుండా నేను బతకలేను అనుకుంటుంది. నిన్ను చూడకుండా  ఉండలేను అనుకొని నిన్ను ఇప్పుడే రప్పిస్తా ఎలా పిలిస్తే వస్తావో నాకు తెలుసని అనుకుంటుంది.


సత్య, నందిని, రేణుక అందరూ కలిసి బొమ్మల కొలువు పేర్చుతారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. సత్య కావాలనే బొమ్మకి ముద్దు పెడుతుంది. క్రిష్‌ తనకు పెట్టలేదని ఫీలవుతాడు. ఇక ఇంతలో భైరవి వచ్చి క్రిష్, హర్షలను పంపేస్తుంది. ఇంతలో ముత్తైదువులు వస్తారు. రేణుక బొట్టు పెట్టడానికి వెళ్తే భైరవితో ముత్తైదువులు మీ పెద్ద కోడలితో కూడా బొమ్మల కొలువు పెట్టించావా తను గొడ్రాలు కదా ఆ పాపం నీ చిన్న కోడలికి కూడా అంటితే అంటారు. దానికి సత్య ముతైదువులు మీద కోప్పడుతుంది. మూఢనమ్మకాలతో సాటి ఆడదాన్ని బాధ పెట్టొద్దని అంటుంది. దానికి పాపం రేణుక రెండు చేతులు జోడించి నేను జీవితంలో చాలా నష్టపోయాను ఇప్పుడు ఇంకేం లేదు అయినా మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని అంటుంది. ఇక నందిని, సత్య పూజ చేస్తారు. ఇంతలో రేణుక కడుపు నొప్పి అన్నట్లు కడుపు మీద చేయి వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సత్య అది చూస్తుంది.


మరోవైపు మైత్రి హర్షని రప్పించడానికి కళ్లు తిరిగి పడిపోయినట్లు నటిస్తుంది. దాంతో బామ్మ కంగారు పడి హర్షకి కాల్ చేసి జరిగింది చెప్తుంది. హర్ష కంగారుగా నందినిని పిలిచి విషయం చెప్తాడు. నందిని వెళ్లమంటుంది కానీ ఇద్దరినీ వదలకూడదని నేను వస్తానని సత్యకి చెప్పి వెళ్తుంది. ఇక రేణుక గదిలో ఉంటే సత్య వెళ్లి ఏంటి అక్కా నీ తప్పు లేకపోయినా సైలెంట్‌గా ఉంటావని అంటుంది. పేరంటాలకు వాయినం ఇవ్వాలని రమ్మని పిలిస్తే  రాదు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తిపోతుంది. 



Also Read: 'త్రినయని' సీరియల్: నయని వైపు దూసుకొచ్చిన యమపాశం.. మధ్యలో గాయత్రీ పాప దగ్గర యూ టర్న్.. చనిపోయేది ఎవరు?