Diwali 2024: దీపావళి జరుపుకోని ఊరు బిశ్రక్ -ఎందుకంటే!

Bishrak villiage: రావణుడు మా ఊర్లో పుట్టాడు అందుకే దీపావళి వేడుకలు తాము జరుపుకోం అంటున్నారు బిస్రక్ గ్రామస్తులు..

Continues below advertisement

Diwali 2024:  దేశమంతా దీపావళి పండుగ జరుపుకోవడానికి రెడీ అవుతోంది. అయితే నార్త్ ఇండియాలోని  కొన్ని ప్రాంతాల్లో  దీపావళిని పండుగలాగా జరుపుకోరు. వారికి అదొక సంతాప దినం. దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న బిశ్రక్ గ్రామంలో దీపావళిరోజు ఎలాంటి సందడి ఉండదు.  కారణం ఆ ఊరు రావణాసురుడు పుట్టిన చోటు కావడమే అంటారు అక్కడి ప్రజలు.

Continues below advertisement

 రావణాసురుడు పుట్టినఊరు బిశ్రక్ 

 ఢిల్లీ సమీపంలోని బిశ్రక్  గ్రామం టెక్నికల్ గా  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి వస్తుంది. ఆ ఊళ్లోనే ఒకప్పుడు  రావణాసురుడు పుట్టాడని  అక్కడి వారు నమ్ముతారు. నార్త్ ఇండియాలో  దసరా, దీపావళి రెండు పండుగలూ రామాయణంతో ముడిపడి ఉంటాయి. దసరా  రావణుడు చనిపోయిన రోజు అయితే దీపావళి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు. అందుకే దసరా రోజున నార్త్ ఇండియాలో  రావణ దహనం జరిపితే... దీపావళి రోజున  రాముడి ఆగమనానికి గుర్తుగా దీపాలు వెలిగిస్తారు. అయితే బిశ్రక్ గ్రామంలో  ఈ రెండు పండుగలను పట్టించుకోరు. తమ వాడైన రావణున్ని  చంపేసి పండుగ చేసుకుంటున్న  రోజు కాబట్టి  దసరా దీపావళి ఇక్కడ జరుపుకోరు.

Also Read: దీపావళికి టపాసులు కాల్చడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా!

రావణుడి తండ్రి "విశ్రవసు " పేరు మీద పుట్టిన ఊరు - బిశ్రక్

విశ్రవసు అనే  మహర్షి పేరు మీద ఆ ఊరికి "బిశ్రక్" అనే పేరు వచ్చిందని అక్కడి వారు చెబుతుంటారు. ఆయనను కలిసిన  కైకసి  అనే రాక్షస యువరాణి తనకు ఆయన వల్ల పిల్లలు కలగాలని కోరగా ఆమె అడిగిన సమయం అసుర సంధ్య అని కాబట్టి ఆమెకు రాక్షసులు పుడతారని విశ్రవసుడు చెప్పాడు. దానికి కైకసి  ఆయన లాంటి గొప్ప  వాడికి రాక్షసులు పుట్టడం  సరికాదని బతిమాలుగా  ఆమెకు పుట్టే మగపిల్లల్లో  చివరివాడు జ్ఞాని అవుతాదని, చిరంజీవిగా  బతుకుతాడని చెప్పాడు. అతడే విభీషణుడు. పెద్ద వాళ్ళిద్దరూ  రావణుడు, కుంభకర్ణుడు. వీళ్ళందరూ పుట్టింది  తమ గ్రామంలోనే అని బిస్రక్  వాళ్ళు చెబుతారు. ఎదిగిన తర్వాత  లంకకు వెళ్లి అక్కడ నుంచి రాజ్యం చేశారని వారి నమ్మకం.

Also Read: దక్షిణావర్తి శంఖం - దీపావళి రోజు పూజించాల్సిన అత్యంత విశిష్టమైన వస్తువు ఇది!

రావణుడు పూజించిన శివలింగం 

బిస్రక్ గ్రామంలో చాలా పురాతనమైన శివలింగం ఉంది. దీనిని రావణుడు, తండ్రి విశ్రవసుడు పూజించారని స్థానిక కథనం.  ప్రస్తుతం ఆ స్థలంలో  ఒక కొత్త గుడిని కట్టారు. 42 అడుగుల ఎత్తైన  శివలింగంతో పాటు ఆ గుడిలో 5.5 అడుగుల ఎత్తున రావణాసురుడి విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంటుంది. దీపావళి రోజున  బాణసంచా కు బదులు రావణుడి ఆత్మ శాంతి కోసం యజ్ఞాలు  చేస్తూ ఉంటారు ఆ ఊరి వాళ్ళు. ఈ తతంగాన్ని చూడడానికి  నార్త్ ఇండియా లోనే చాలా చోట్ల నుంచి టూరిస్టులు భారీగా  బిశ్రక్ చేతుకుంటూ ఉంటారు. నోయిడా నుండి  15 కిలోమీటర్ల దూరంలో  గ్రామం ఉంటుంది. ఢిల్లీ నుండి వెళ్లడం చాలా సులువు.

Also Read: ధన త్రయోదశి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా చెప్పేయండి!

Continues below advertisement
Sponsored Links by Taboola