Dhanteras 2024: ఆశ్వయుజ మాసం అమావాస్య ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబరు 30న ధనత్రయోదశి వచ్చింది.  ఈ రోజు కొన్ని రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది.  ఈ సమయంలో మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు.  ప్రణాళిక ప్రకారం అన్నీ పూర్తిచేస్తారు.  ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం మీపై ఉంటుంది. మరి ధన త్రయోదశి రోజు అదృష్టాన్నిచ్చే రాశులలో మీ రాశి ఉందా... ఇక్కడ తెలుసుకోండి.  


మేష రాశి (Aries Dhanteras Astrology) 


మేష రాశి వారికి ధన త్రయోదశి చాలా మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ రోజంతా మీకు సానుకూలతతో నిండి ఉంటుంది. గడిచిన రోజుల కన్నా వ్యాపారులు ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన విషయాలు కొలిక్కివస్తాయి. అనుకోని ఆదాయం చేతికందుతుంది. మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. 


వృషభ రాశి  (Taurus Dhanteras Astrology)


ధనత్రయోదశి రోజు వృషభ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొత్త మూలాల నుంచి ఆదాయం వస్తుంది. ఎంత పెద్ద సమస్య అయినా సులభంగా పరిష్కారం అవుతుంది. వ్యాపారస్తులు లాభపడతారు. ఆరోగ్యం విషయంలో రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ సమేతంగా బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 


Also Read: ధన త్రయోదశి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా చెప్పేయండి!


కన్యా రాశి  (Virgo Dhanteras Astrology)


కన్యా రాశివారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ధన త్రయోదశి మీకు అన్నీ శుభ శకునాలనే తీసుకొస్తుంది. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పెండింగ్ లో ఉన్న మనీ చేతికందుతుంది. వ్యాపారంలో కొనసాగుతున్న అస్థిరత తొలగిపోతుంది. సామాజికంగా బలంగా ఉంటారు. మీరు ఈ రోజు కొన్ని విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు
 
మకర రాశి (Capricorn  Dhanteras Astrology)


మకర రాశివారు ఈ రోజు విజయాన్ని పొందుతారు. ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారంలో పెద్ద ఆర్డర్ పొందవచ్చు. ఆర్థిక లాభాలతో పాటు, మీ ప్రత్యర్థులను ఓడించడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. మీరు అదృష్టం కంటే కష్టపడి పని చేయడాన్ని ఎక్కువగా విశ్వసించవలసి ఉంటుంది, లక్ష్మీ దేవి ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది


Also Read: ధన త్రయోదశికి వెండి, బంగారం కొనలేనివారు తక్కువ ఖర్చుతో ఇవి కొనుక్కున్నా మంచిదే!


మీన రాశి (Pisces Dhanteras Astrology) 


ధనత్రయోదశి మీనరాశివారికి వారికి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అధికలాభాలు ఆర్జిస్తారు. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. పనిపట్ల శ్రద్ధగా, బాధ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు..


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!