అక్టోబరు 30 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు కొన్ని చిక్కుముడులను పరిష్కరించుకుంటారు. ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ వివాహాలకు అనుకూల సమయం. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
వృషభ రాశి
ఈ రోజు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. యోగా, వ్యాయామంపై శ్రద్ధ వహించండి. మీ పని మీరే చేయండి ఇతరులకు వదిలివేయవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు మంచి రోజు.
మిథున రాశి
ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచండి. మీరు సోదరులు మరియు సోదరీమణుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ నాయకత్వ సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఇంటి పనులతో చాలా బిజీగా ఉంటారు. వైవాహిక జీవితంలో క్షీణత ఉండవచ్చు. మీరు కళాత్మక కార్యకలాపాలతో బిజీగా ఉంటారు. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
Also Read: దీపావళికి టపాసులు కాల్చడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా!
కర్కాటక రాశి
ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం ద్వారా మీరు ఈరోజు ఉపశమనం పొందుతారు. పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులను మీరు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు కార్యాలయంలో మీ బాధ్యత పెరుగుతుంది. ఇంట్లో సోదరులు లేదా సోదరీమణుల వివాహం గురించి ఎటువంటి ఆందోళనలు ఉండవు.
సింహ రాశి
వైవాహిక జీవితంలో సామరస్యం చాలా బాగుంటుంది. కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న వివాదాలుంటాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. పిల్లల ప్రవర్తనలో మెచ్చుకోలుగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు కూడా మీ సామర్థ్యాన్ని , పని తీరును ప్రశంసిస్తారు. సన్నిహితులతో విభేదాలుండే అవకాశం ఉంది.
కన్యా రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో చిక్కుకున్న డబ్బును అందుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడగలరు. మీరు ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారు. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి.
తులా రాశి
ఈ రోజు నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకోండి. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యక్తులను కలవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. రాజకీయ వ్యక్తులు పెద్ద పదవులు పొందగలరు. ఏదైనా పనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ఇబ్బంది పడతారు.
Also Read: ధన త్రయోదశి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా చెప్పేయండి!
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది. చాలా కాలం తర్వాత రుణం తీసుకున్న మొత్తాన్ని పొందిన తర్వాత మీరు ఉపశమనం పొందుతారు. ఇంటి నిర్వహణలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్నేహితుల నుంచి మీకు సహకారం అందుతుంది. విద్యార్థులు తమ వృత్తి, చదువుల పట్ల అవగాహన కలిగి ఉంటారు. కెరీర్లో విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి
ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి రోజు. మీరు ఏదైనా తీవ్రమైన సమస్యను సన్నిహితులతో చర్చించవచ్చు. మీరు ప్రయాణానికి సంబంధించి ఆలోచన చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సమాజంలో మీ గౌరవం మెరుగుపడుతుంది.
మకర రాశి
మీరు మీ బాధ్యతలను హృదయపూర్వకంగా నెరవేరుస్తారు. సామాజిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. ప్రమోషన్ లేదా బోనస్ పొందే అవకాశం ఉంది. మీరు భాగస్వామ్యంతో చేసిన పని నుంచి ప్రయోజనం పొందుతారు. అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి.
కుంభ రాశి
ఈ రోజు కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు. కెరీర్ సంబంధమైన అడ్డంకులు తొలగిపోవడంతో మీరు ఉపశమనం పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వివాదాస్పద విషయాలను చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ప్రతికూల విషయాలను తలుచుకోవద్దు..ఇది మీ ప్రస్తుత పనిపై ప్రభావం చూపిస్తుంది.
Also Read: శ్మశానంలో దీపావళి - సమాధులకు నైవేద్యం , అదే ప్రసాదం!
మీన రాశి
ఈ రోజు మీరు ఓ శుభవార్త వింటారు. షేర్ మార్కెట్ నుంచి ఆర్థిక లాభం పొందుతారు. విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది..అయితే ఈ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు.