Tholi Ekadashi 2025: దేవశయన ఏకాదశి రోజు చతుర్ముఖ దీపాన్ని ఎందుకు వెలిగించాలి?
దేవశయని ఏకాదశి నుంచి విష్ణువు శయన కాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున జగత్తును పాలించే దేవుడి అనుగ్రహం లభిస్తే..ఏడాది మొత్తం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం
దేవశయని ఏకాదశి రోజు విష్ణువు పూజలో భాగంగా నాలుగు ముఖాల నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు.
ఏకాదశి నాడు చతుర్ముఖ దీపాన్ని వెలిగిస్తే ఇంటికి నలువైపుల నుంచి సుఖం, సంతోషం, ధనం వస్తుందని నమ్ముతారు
ఆర్థిక సంక్షోభంలో ఉండేవారు దేవశయని ఏకాదశి రోజు సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించి 11 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓం నమో నారాయణాయ నమః మంత్రాన్ని జపించండి.
దేవశయని ఏకాదశి రోజు ఉదయాన్నే స్నానమాచరించి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి దేవుడి ముందు దీపం వెలిగించి విష్ణు సహస్రనామం పఠిస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం
దేవశయన ఏకాదశి నుంచి నాలుగు నెలల చాతుర్మాస్యం ప్రారంభమవుతాయి ... నవంబర్లో వచ్చే దేవఉఠని ఏకాదశితో ముగుస్తుంది.