Shani Vakri 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం సమయానుసారం దాని కదలికను మారుస్తుంది, ఇది అన్ని రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, శని గ్రహం కూడా ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దాని కదలికను మారుస్తుంది. నెమ్మదిగా కదలడం వల్ల శని ఒక రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు. అందుకే శనిని మందరుడు అని కూడా అంటారు.
2025 మార్చిలో మీన రాశిలో ప్రవేశించిన శని జూలై 13 నుంచి ఇదే రాశిలో తిరోగమనం చెందుతాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని తిరోగమన స్థితిని శుభంగా పరిగణించరు, ఎందుకంటే వక్ర మార్గంలో అంటే శని వెనుకకు నడవటం ప్రారంభిస్తాడు. ఈ సమయంలో కొన్ని రాశులపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మీనంలో శని తిరోగమనం మూడు రాశులపై ప్రతికూల ప్రభావం చూపించనుంది.
శని తిరోగమనం
జూలై 13 ఉదయం శని మీనంలో తిరోగమనం చెందుతాడు. తిరిగి 2025 నవంబర్ 28 ఉదయం సాధారణ స్థితిక వస్తాడు. ఈ 138 రోజుల పాటు శని వెనుకకు నడుస్తూ కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా ఏ రాశులపై అయితే ఎల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుందో వాళ్లు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
ప్రస్తుతం కుంభ రాశి, మీన రాశి, మేష రాశివారికి ఎల్నాటి శని ఉంది. మీనం వారికి జన్మంలో నడుస్తోంది. సింహ రాశి వారికి అష్టమ శని, ధనస్సు రాశివారికి అర్ధాష్టమ శని ఉంది. శని తిరోగమనం చెందే సమయంలో ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. అయితే తిరోగమనం సమయంలో ఈ రాశులపై మాత్రమే కాదు..మరికొన్ని రాశులపైనా శని ప్రభావం ఉంటుంది. అయితే మీ వ్యక్తిగత జాతకంలో గురుడు, శుక్రుడు సంచారం శుభప్రదంగా ఉంటే శని ప్రభావం అంత ప్రతికూలంగా ఉండదని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
వృషభ రాశి (Taurus)
శని తిరోగమనం వల్ల వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు, ధన వ్యయం అకస్మాత్తుగా పెరుగుతుంది. ఉద్యోగం-వ్యాపారంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి, ఈ సమయంలో ప్రతి పనిని చాలా కచ్చితంగా ఆలోచించి జాగ్రత్తగా చేయండి, డబ్బును కూడా ఆలోచించి ఖర్చు చేయండి. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
కర్కాటక రాశి (Cancer)
శని తిరోగమనం సమయంలో కర్కాటక రాశి వారికి కూడా అంత శుభంగా ఉండదు. ఈ సమయంలో మీరు ఏం ప్రారంభించినా ఆశించిన ఫలితాన్నివ్వవు. మతపరమైన పనులలో కూడా సమస్యలు తలెత్తవచ్చు, వ్యాపార రంగంలో విస్తరణ తగ్గుతుంది. ఉద్యోగం చేసే ప్రదేశంలో గౌరవం తగ్గుతుంది. ఈ సమయంలో మీరు అదృష్టంపై ఆధారపడకుండా కర్మ, కష్టానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.
మీన రాశి (Pisces)
మీన రాశి వారకి ఏల్నాటి శని నడుస్తోంది. ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే శని మీ రాశిలో తిరోగమనంలో ఉన్న 138 రోజులు మీకు కష్టాలు మొదలు. వ్యక్తిగత జీవితంలో వివాదాలుంటాయి, అనారోగ్య సమస్యలు బాధపెడతాయి. ఉద్యోగం, వ్యాపారంలో కష్టానికి తగిన ఫవితం పొందుతారు. అయితే వివాదాలకు దూరంగా ఉండండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం మీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో సమాచారం పూర్తిగా మీ ఒక్కరికే చెందుతుందని ధృవీకరించలేం. మీ జాతకంలో ఉండే గ్రహాల స్థానం ఆధారంగా కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. దీనిని పరిగణలోకి తీసుకునేముందు మీకు నమ్మకమైన జ్యోతిష్య శాస్త్ర నిపుణులను సంప్రదించండి.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ ఎందుకుంటుంది... పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
అరుణాచల గిరిప్రదక్షిణ - ఈ 44 ఎనర్జీ పాయింట్స్ మిస్ చేయొద్దు ..ఇదిగో రూట్ మ్యాప్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!