వరదవెల్లి దత్తాత్రేయుడు. ప్రపంచంలోనే ఏకైక రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు.
స్వామివారి ఆలయం ఎక్కడుంది
వరదవెల్లి గ్రామం తెలంగాణ కరీంనగర్‌ జిల్లా బోయినపల్లి సమీపం ‘మిడ్‌ మానేరు’ జలాశయం సమీపంలో ఉంది. తరచూ ఈ గ్రామం ముంపునకు గురవుతుండడంతో వరదవెల్లి అనే పేరు వచ్చిందని కొందరు.. దత్తాత్రేయ స్వామివారు ‘వరద హస్తములతో’ ఇక్కడ వెలియడం వల్ల ‘వరదవెల్లి’ అనే పేరొచ్చిందని మరికొందరు చెబుతారు. రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు ఉండడం ఈ గ్రామ ప్రత్యేకత. ఇలాంటి క్షేత్రం ప్రపంచంలో ఎక్కడా లేదు. అప్పట్లో దత్త వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాకే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేవారట. కానీ కాలక్రమేణా ఈ ఆచారం మరుగున పడిపోయింది. 


చారిత్రక కథనం
దాదాపు 900 సంవత్సరాల క్రితం దేశాటనలో భాగంగా శ్రీవేంకటాచార్యులు అనే వైష్ణవ అవధూత వరదవెల్లి గుట్టమీదు వేంకటేశ్వరస్వామి అనుగ్రహం కోసం 12 ఏళ్లపాటూ తపస్సు చేశాడట. వెంకావధూత వేంకటేశ్వర స్వామి భక్తుడే కాదు శ్రీ గురు దత్తాత్రేయుల వారి భక్తులు కుడా. అవధూత తపస్సుకి మెచ్చిన స్వామివార్లు ఇద్దరూ కలసి.. ‘దత్తవెంకటేశ్వర స్వామిగా’ దర్శనమిచ్చారు. ఆ తర్వాత దత్తాత్రేయుడి దర్శనంకోసం 28 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఓ రోజు ప్రత్యక్షమైన దత్తాత్రేయుడు...వెంకావధూతతో నీకు రాహు మహర్దశ ఉంది.ఆ కర్మను అనుభవించాలి కాబట్టి నేనే రాహురూపం లోకి మారి శయన సర్పరూపుడిగా ఆ పని చేస్తానని చెప్పాడు. అలా దత్తాత్రేయ స్వామివారు రాహురూప శయన దత్తాత్రేయుడుగా మారి వెంకావధూత ఖర్మలను త్వరగా అనుభవించేట్టుగా చేసి వెంకావధూతను తనలో ఐక్యం చేసుకున్నాడని చెబుతారు. 


Also Read: ఈ అమ్మవారికి కుంకుమ పెట్టి ఏదైనా కోరుకుంటే 41 రోజుల్లో నెరవేరతుందట


ఈ ఆలయం ప్రత్యేకతలు
దత్తాత్రేయుడు రాహు రూపంలో ఉండడం
విగ్రహంలో దాగిఉన్న జంట సర్పాల ఆనవాళ్ళు ఫొటో తీస్తే స్పష్టంగా కినిపిస్తాయి
దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో ’దత్త వెంకటేశ్వరస్వామి’ గా పూజలందుకోవడం


కోర్టు కేసుల నుంచి ఉపశమనం కలిగేందుకు, ఉద్యోగం కోసం దండయాత్ర చేసేవారు, రాహు మహర్ధశ ఉన్నవారు, వయసు మీదపడుతున్నా వివాహం కానివారు, ఇంట్లో నిత్యం గొడవలు పడే భార్య-భర్త, చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న వారు, సంతానం లేనివారు సంతానాన్ని నష్టపోతున్న వారు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే తక్షణ ఫలితాలు పొందుతారని విశ్వాసం. 


Also Read: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతుంది, మీకు ధైర్యం ఉందా


Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది