BJP Janasena Alliance: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేటి రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. అయితే బీజేపీ చీఫ్ పర్యటనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల మంగళగిరిలో జరిగిన సమావేశంలో గత ఎన్నికల్లో చాలా తగ్గామని, ఇకనుంచి తగ్గేదేలే అని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలు జనసేనతో ఉత్సాహాన్ని నింపాయి. రెండు రోజులపాటు ఏపీ పర్యటనకు రానున్న జేపీ నడ్డా.. బీజేపీ, జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ పేరును ప్రకటించాలని డిమాండ్లు మొదలయ్యాయి.


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి కనుక, ఈ కూటమి సిఎం అభ్యర్థిగా పవన్‌ కళ్యాణ్‌ను ప్రకటించాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకటమహేష్‌ డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీకి వస్తున్న జేపీ నడ్డాకు జనసేన తరఫున ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్‌ను తమ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే రెండు పార్టీల మధ్య మైత్రి మరింత బలపడుతుందని, పార్టీ శ్రేణులు సైతం మరింత ఉత్సాహంతో పని చేస్తాయని అభిప్రాయపడ్డారు.





పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి తమ ఆకాంక్షను నెరవేర్చాలని జనసేన నేతలు బీజేపీ అధిష్టానాన్ని కోరారు. 

రెండు రోజుల ఏపీ పర్యటనకు నడ్డా.. 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda) నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈవెంట్లలో భాగంగా నేడు ఏపీకి జేపీ నడ్డా రానున్నారు. ఏపీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా విజయవాడ, రాజమహేంద్రవరాల్లో పలు కార్యక్రమాలకు హాజరు అవుతారు. నేడు  విజయవాడలో బీజేపీ శక్తికేంద్రాల ఇన్‌చార్జీలు, కోర్‌ కమిటీ నేతలతో భేటీలలో పాల్గొననున్న జేపీ నడ్డా, మంగళవారం సాయంత్రం రాజమండ్రిలో బహిరంగ సభకు హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏపీకి రానుండటంతో పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం కనిపిస్తోంది. బీజేపీ, జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించాలని జనసేన నేతల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. 


 Also Read: JP Nadda AP Tour: నేడు ఏపీ పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పూర్తి షెడ్యూల్ ఇదే 


Also Read: Palnadu Crime : టీడీపీ నేత జల్లయ్య హత్య కేసులో 9 మంది అరెస్టు, పాత గొడవలే హత్యకు కారణం- ఎస్పీ శివ శంకర్ రెడ్డి