Dasaswamedh Ghat in Varanasi:  కాశీ నగరం పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ప్రధానంగా మూడు. ఒకటి కాశీ విశ్వనాథ మందిరం, రెండు గంగా నది మూడోది పవిత్ర గంగా మాతకిచ్చే హారతి. కాశీ వెళ్లిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గంగా హారతిని కళ్ళారా చూసి రావాలనే అనుకుంటారు. అంతటి పవిత్రమైన గంగా హారతి జరిగే ప్రధానమైన స్థలమే దశ - అశ్వమేధ ఘాట్.


ఫిబ్రవరి 26 మహ శివరాత్రి...ఈ సందర్భంగా  ఈ ఘాట్ గురించి ప్రత్యేక కథనం...


 బ్రహ్మ పది యాగాలు చేసిన స్థలం ఇది 


కాశీ విశ్వనాథ మందిరానికి అతి దగ్గరగా ఉండే ఈ ఘాట్ వద్ద  పూర్వకాలంలో సృష్టి కర్త బ్రహ్మ  పది అశ్వమేధ యాగాలు చేశాడని అందుకే దీనికి దశ -అశ్వమేథ ఘట్ అనే పేరు వచ్చిందని చెబుతారు. మరో కథనం ప్రకారం బ్రహ్మదేవుడు పరమశివుడ్ని భూమికి ఆహ్వానించిన ప్రాంతంగా కూడా దశాశ్వమేధ ఘాట్ ప్రసిద్ధి చెందింది. కాశీలోని ఘాట్ లు అన్నిట్లో  చాలా పవిత్రమైంది గా దీనికి పేరు. పురాతన ఘాట్ పాడైపోవడంతో 1748లో మరాఠా పేశ్వా బాలాజీ బాజీరావు ఈ ఘాట్ ను నిర్మించారు. మరో 30 ఏళ్ల తర్వాత  ఇండోర్ మహారాణి అహల్య బాయి ఈ ఘాట్ ను అభివృద్ధి చేశారు.


Also Read: కాశీలో మహాశివరాత్రి సందడి - గంగా సంగమం జరిగే ప్రదేశం అస్సీ ఘాట్ విశిష్టత ఇదే!


దశాశ్వమేధ ఘాట్  ప్రత్యేకం : గంగా హారతి 


ఈ ఘాట్ ప్రత్యేకం ముందే చెప్పుకున్నట్టు గంగా హారతి. ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో  పూజారులు రకరకాల దీపాలతో లయబద్ధంగా గంగానదికి ఇచ్చే హారతి ఎంతో పాపులర్. ఈ హారతిని కళ్ళారా చూడడం ఎంతో పుణ్యం అని  భక్తులు భావిస్తుంటారు. గంగా నదిలో పడవ పై ఏర్పాటుచేసిన కుర్చీలలో కూర్చుని ఈ గంగా హారతిని చూడడం కోసం  టూరిస్టులు పోటీ పడుతుంటారు. సప్త ఋషులకు  ప్రతీక గా ఏడుగురు యువకులు గంగా హారతి ఇస్తారు. వారణాసి రైల్వే స్టేషన్ నుంచి ఆటో రిక్షాలో  30 రూపాయల రుసుముతో  ఈ ఘాట్ వద్దకు సులువుగా చేరుకోవచ్చు. 


Also Read: శివరాత్రి మహత్యాన్ని చెప్పే అద్భుతమైన కథలివి.. లింగోద్భవ సమయానికి ఇలా చేయండి!


తీవ్రవాదుల బాంబు దాడికి చెక్కు చెదరని  వారణాసి


2010లో  దశ అశ్వమేధ ఘాటు వద్ద తీవ్రవాదులు బాంబు దాడి జరిపారు. ఈ దాడిలో ఇద్దరు భక్తులు మృతి చెందగా 37 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు విదేశీ టూరిస్టులు. గంగా హారతిస్తున్న  చివరి నిముషాల్లో ఈ దాడి జరిగింది ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ. అయినప్పటికీ కాశీవాసుల ధైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ దశాశ్వమేధ ఘాట్ లో ఇచ్చే గంగా హారతి ని చూడడానికి భక్తులు పర్యాటకులు సాయంత్రం అయ్యేసరికి పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకుంటారు.


Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!