Maha Shivaratri Songs In Telugu: మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించాడు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తారు. అభిషేకాలు, పూజలు, భజనలతో ప్రతిక్షణం పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26 బధవారం మహాశివరాత్రి. ఈ  సందర్భంగా మిమ్మల్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తే శివయ్య భక్తి పాటలు మీకోసం..

భో శంభో శివ శంభో స్వయంభో ..గంగాధర శంకర కరుణాకర ..మామవ భవసాగర తారక  అంటూ సాగే ఈ పాటను ప్రశాంతంగా వింటే ఇట్టే లీనమైపోతారు.



Also Read: అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయ్యారు!


 ఆటగదరా శివా అంటూ సాగే ఈ పాట జీవిత చిత్రాన్ని కళ్లముందు ఆవిష్కరిస్తుంది. ఆటగదరా శివ.. ఆటగద కేశవ.. ఆటగదరా నీకు అమ్మతోడు ఆటగదరా శివ ఆటగద కేశవ.. ఆటగదరా నలుపు ..ఆటగదరా తెలుపు.. నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు... ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను లాంటి చిన్న చిన్న పదాలతో జీవితాన్ని తట్టిలేపిన తనికెళ్ల భరణి రచకు ఏసుదాసు స్వరం ప్రాణం పోసింది



చావుకి పుట్టుకకు అన్నీ ఎదురీతలే. ప్రతిమనిషీ బంధాలకు బంధీనే.. అందరికీ వేదన బాధ ఒక్కటే... కరుణ చూపించు భోళాశంకరా అంటూ ఈ పాట అద్భుతంగా ఉంటుంది



Also Read: వయసైపోతున్నా పెళ్లి కాలేదా..అయితే ఈ ఆలయానికి వెళ్లిరండి!


బ్రతుకంటే బొమ్మల ఆట.. పుట్టుక తప్పదు, మరణం తప్పదు..అన్నీ తెలిసి మాయలో బతుకుతున్నాం అంటూ మనిషిలో ఉంటే అంతర్యామిని తట్టిలేపే సాంగ్  ఇది. జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోది



Also Read:  చివరకు మిగిలేది బూడిదే - లయకారుడు చెప్పేది ఇదే!


నీ ముందూ నీ వెనుకా జరిగేదంతా మాయే, మనవాళ్లు అనుకున్నది మాయే..జననం, మరణం మధ్యలో జరిగేదంతా మాయే , జగమంతా మాయ, జనమంతా మాయ, కళ్లారా చూసే ప్రతిదీ కూడా తెల్లారేసరికి మాయే...అంటూ సాగే ఈ పాట ఆలోచింపజేసేలా ఉంటుంది 



Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?


నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంత సేపు ఆ తర్వాత నువ్వు దేవుడివి నేను అంటరానివాడిని ...నీ కాలు కిందపెట్టకుండా నిన్ను గర్భగుడికి నేను చేర్చాను కానీ నిన్ను చెక్కిన నన్ను గుడిలో అడుగుపెట్టనివ్వవు. నీ ముందు వెలిగే దీపాలకోసం నేను చెమటలు చిందించాను కానీ మా కొడిగట్టిన బతుకులు మార్చవేల శివా అంటూ ఓ శిల్పి ఆవేదనే ఈ పాట.



ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం..వీర భద్రయ అగ్ని నేత్రాయ ఘోర సంహారహ..సకల లోకాయ శ్రావ భూతయ సత్య సాక్షాత్కర
శంబో శంబో శంకరా... అంటూ నేను దేవుడ్ని సినిమాలో ఈ పాట చూస్తుంటే ఆ శంకరుడిలో కలసిపోయేందుకు భక్తుల తాపత్రయం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది...



ట్రెండ్ తగ్గట్టుగా ఇప్పటి జనరేషన్ ని అట్రాక్ట్ చేసేలా రూపొందించిన హర హర శంభో సాంగ్  అదిరిపోయేలా ఉంటుంది



మహా దేవుడి గురించి ఎక్కడెక్కడో వెతుకుతారు కానీ ఆ పరమేశ్వరుడు జ్యోతి స్వరూపంలో మీ హృదయంలోనే కొలువై ఉంటాడు.  ఆ జ్యోతి కనిపించకుండా అజ్ఞానం అనే చీకటి కమ్మేసింది. ఆ చీకటిని పారద్రోలితేనే అఖండ తేజోమయుడైన పరమేశ్వర స్వరూపం కనిపిస్తుంది. ఈవిషయాన్ని తెలిపే పాటే నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు.. 


Also Read: గంగనెత్తికెత్తినోడు , గౌరీదేవి మెచ్చినోడు శివయ్య..ఈ శివరాత్రికి మంగ్లీ సాంగ్ వచ్చేసింది చూశారా!


Also Read: పంచారామాలు, పంచభూత లింగాలు మాత్రమే కాదు..పంచకేదార క్షేత్రాల గురించి తెలుసా!