Kalyana Sundar Temple 

జడలు కట్టిన కేశాలతో, తోలుదుస్తులతో, కాలసర్పాన్ని కంఠాభరణంగా వేసుకుని పరమేశ్వరుడు తిరిగితే  అమ్మవారు మాత్రం ఏడువారాల నగలతో పట్టుపీతాంబరాలతో సర్వాలంకారశోభితమై అలరారుతుంది.  శంకరుడు వాక్కు అయితే పార్వతి వాక్యానికి అర్థం. ఆయన ఆదిభిక్షువైతే ఈమె ఆయనకు అన్నం పెట్టే అన్నపూర్ణ . ఇంతకన్నా ఒద్దికైన ఆలుమగలు ఎక్కడుంటారు. అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆదిదంపతులుగా చెబుతారు..అలాంటి ఆదిదంపతులకు కళ్యాణం జరిగిన ప్రదేశమే కళ్యాణ సుందర్ ఆలయం. 

Also Read: తాళి,మెట్టెలు తీసేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారేమో - ఈ విషయాలు తెలుసా మరి!

తమిళనాడులో ఉన్న ఆలయం

తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుట్టాలమ్‌ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది కళ్యాణసుందర్‌ ఆలయం. కావేరీ నదీతీర ప్రాంతంలో ఉన్న ఈ  ఈ ఆలయంలోని పార్వతీపరమేశ్వరులు పాణిగ్రహణ  విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. అంటే ఆదిదంపతుల వివాహం జరిగిన పవిత్రమైన స్థలంగా భక్తులు భావిస్తారు. అందుకే పెళ్లికాని వారు ఒక్కసారి ఈ ఆలయానికి వెళ్లొస్తే చాలు ఏడాది తిరిగేలోగా వివాహం జరిగిపోతుందని విశ్వాసం.

Also Read:  చివరకు మిగిలేది బూడిదే - లయకారుడు చెప్పేది ఇదే!

చోళులు నిర్మించిన ఆలయం

ఈ  ఆలయాన్ని తొమ్మిదో శతాబ్ధంలో చోళరాజులు నిర్మించారని చెబుతారు. ఆ తర్వాత 1336-1485 మధ్య సంగమ రాజవంశం , 1491-1570 మధ్య తులువా రాజవంశం విస్తరణ పనులు చేపట్టింది. అనంతరం ఆలయ అభివృద్ధిలో విజయగర పాలకుల పాత్ర కూడా ఉంది.  ఈ ఆలయంలో ఉదయం ఐదున్నర నుంచి రాత్రి పది గంటల వరకూ ప్రత్యేక పూజలు, సేవలు ఉంటాయి. కేవలం వైష్ణవ ఆలయాల్లో మాత్రమే ఇలాంటి సేవలుంటాయి. ఇక్కడ శివాలయంలోనూ ఉదయం నుంచి రాత్రి వరకూ వరుస సేవలు కొనసాగుతాయి.

Also Read:  ప్రతి ఆదివారం ఇది చదువుకుంటే విజయం, ఆరోగ్యం, సర్వశత్రు వినాశనమ్!

లింగరూపంలో రాహువు

నవ గ్రహదేవతల్లో ఒకరైన రాహువు ఇక్కడ లింగరూపంలో ఉండటం వలన జాతకంలో ఉన్న రాహుదోషం తొలగిపోయేందుకు రాహు శాంతి పూజలు కూడా చేయిస్తారు. 

Ardhanarishwara stotram - అర్ధనారీశ్వర స్తోత్రం - 

చాంపేయగౌరార్ధశరీరకాయైకర్పూరగౌరార్ధశరీరకాయ |ధమ్మిల్లకాయై చ జటాధరాయనమః శివాయై చ నమః శివాయ ||  

కస్తూరికాకుంకుమచర్చితాయైచితారజఃపుంజవిచర్చితాయ |కృతస్మరాయై వికృతస్మరాయనమః శివాయై చ నమః శివాయ || 

ఝణత్క్వణత్కంకణనూపురాయైపాదాబ్జరాజత్ఫణినూపురాయ |హేమాంగదాయై భుజగాంగదాయనమః శివాయై చ నమః శివాయ || 

విశాలనీలోత్పలలోచనాయైవికాసిపంకేరుహలోచనాయ |సమేక్షణాయై విషమేక్షణాయనమః శివాయై చ నమః శివాయ || 

మందారమాలాకలితాలకాయైకపాలమాలాంకితకంధరాయ |దివ్యాంబరాయై చ దిగంబరాయనమః శివాయై చ నమః శివాయ ||  

అంభోధరశ్యామలకుంతలాయైతటిత్ప్రభాతామ్రజటాధరాయ |నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయనమః శివాయై చ నమః శివాయ || 

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయైసమస్తసంహారకతాండవాయ |జగజ్జనన్యై జగదేకపిత్రేనమః శివాయై చ నమః శివాయ ||  

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయైస్ఫురన్మహాపన్నగభూషణాయ |శివాన్వితాయై చ శివాన్వితాయనమః శివాయై చ నమః శివాయ || 

ఏతత్పఠేదష్టకమిష్టదం యోభక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ |ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలంభూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ||  

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత అర్ధనారీశ్వర స్తోత్రమ్ |

మార్చి 8 శుక్రవారం శివరాత్రి

మార్చి 8 శుక్రవారం రాత్రి 8గంటల 13 నిముషాల వరకూ త్రయోదశి ఉంది... ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమైంది . మార్చి 9 శనివారం సాయంత్రం 5 గంటల 59 నిముషాల వరకూ చతుర్థశి ఉంది... అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి ఉండడం ప్రధానం..అందుకే మహాశివరాత్రి మార్చి 8న జరుపుకోవాలి. 

Also Read: మార్చి నెలలో ఈ రాశులవారిని అష్టమ శని అష్టకష్టాలు పెడుతుంది!