WPL Points Table 2024 Mumbai Indians at Top With 6 Points: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL)లో ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bangalore)ను చిత్తుగా ఓడించి టాప్‌కు చేరుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటి బెంగళూరుపై ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. బెంగళూరు బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్‌ స్మృతి మంధాన 9, సోఫి డెవిన్‌ 9 తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఇతెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన కూడా  11 పరుగులకే పెవిలియన్‌ చేరింది. కానీ ఎలిస్‌ పేర్రి జట్టును ఆదుకుంది. 44 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరుకు ఆ మాత్రం సోరైనా అందించింది. జార్జియా వేర్‌హామ్  కూడా 27 పరుగులతో పర్వాలేదనిపించింది. ముంబయి బౌలర్లలో నాట్ స్కివర్, పూజా వస్త్రాకర్ చెరో రెండు.. ఇస్సీ వాంగ్, సైకా ఇషాక్ ఒక్కో వికెట్‌ తీశారు. దీంతో బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. తర్వాత బెంగళూరు నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలోనే ఛేదించింది. బ్యాటింగ్‌లో యాస్తికా భాటియా 31, మ్యాథ్యూస్‌ 26, నాట్ స్కివర్ 27, అమేలియా ఖేర్‌ 40 రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫి డెవిన్‌, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంకా పాటిల్‌ ఒక్కో వికెట్ తీశారు.  ఈగెలుపుతో ఆడిన నాలుగు మ్యాచుల్లో ముంబయి మూడింటిలో నెగ్గి 6 పాయింట్లతో పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (4), యూపీ (4), బెంగళూరు (4), గుజరాత్‌ పాయింట్లేవీ లేకుండా ) ఉన్నాయి.


మూడో మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి


వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2024)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers) వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌పై( Gujarat Giants) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ లీగ్‌లో రెండో మ్యాచ్‌ ఆడుతున్న గుజరాత్‌ మరోసారి బ్యాటింగ్‌లో విఫలమైంది.  మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రాణించారు. బెంగళూరు బౌలర్లలో సోఫీ మోలినెక్స్ 3, రేణుకా ఠాకూర్‌సింగ్‌ 2, జార్జియా వారెహమ్‌ ఒక వికెట్‌ తీసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి బ్యాటర్లను కట్టుదిట్టంగా బంతులు వేసి హడలెత్తించారు. దయాలన్ హేమలత 31, హర్లీన్‌ డియోల్ 22 ఫర్వాలేదనిపించడంతో.. గుజరాత్‌ 7 వికెట్ల నష్టానికి 107 పరుగులైనా చేయగలిగింది. వారిద్దరూ ఆడకుంటే ఇంకా తక్కువ స్కోర్‌కే గుజరాత్ జెయింట్స్‌ పరిమితమయ్యేది. అనంతరం బెంగళూరు కెప్టెన్‌ స్మృతీ మంధాన (43), సబ్బినేని మేఘన (35), ఎల్సీ పెర్రీ (23) రాణించడంతో.. 108 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. కేవలం 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది.



ఢిల్లీ విజయం..
వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2024)లో యూపీ వారియర్స్‌(UP Warriorz)పై ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) ఘన విజయం సాధించింది. తొలుత బంతితో ఆ తర్వాత బ్యాటుతో ఢిల్లీ చెలరేగిపోయింది. ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ 120పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి సునాయసంగా చేధించింది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (64*), మెగ్‌ లానింగ్‌ (51) అర్ధశతకాలతో మెరిశారు.