Shivaratri Mangli Song 2025: సినిమా పాటలు ఓవైపు జానపద, భక్తి పాటలు మరోవైపు..అన్నింటిలోనూ సింగర్ మంగ్లీ తనదైన ముద్ర వేసుకుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా స్పెషల్ సాంగ్స్ రిలీజ్ చేసే మంగ్లీ ఫిబ్రవరి 26 శివరాత్రి సందర్భంగా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాటను సంగారెడ్డి మండలం కల్పగురు గ్రామ కాశీ విశ్వేశ్వర ఆలయంలో చిత్రీకరించారు. జోడు కోడే ముగ్గులోడ శివయ్య అంటూ మొదలయ్యే ఈ పాట మొత్తం ఇక్కడ చూసేయండి.
పాట ఇదే...మూడు మూడు కన్నులోడా శివయ్య ముల్లోకపాలకుడా శివయ్య మా దేవాదిదేవా శంకరాఅడ్డ అడ్డ బొట్టువాడా శివయ్య అండపిండమైనవాడా శివయ్య అర్థనారీశ్వరుడా రావయ్య
వల్లకాడే ఇల్లునీకు భూతపాలుడా...వల్లకానిదంటూ ఏమిలేని సోమనాధుడావల్లుబూడిదల్లుపూసుకున్న దేవుడా..నల్లనాగు మెడన చుట్టుకున్న నీలకంఠుడా..దయాకరా దిగంబరా హరోంహరా మహేశ్వరా...
గంగనెత్తినోడా శివయ్య...గౌరీదేవి మెచ్చినాడో శివయ్య ..గండాలు బాపేటోడా శంకరాభయములేని భైరవుడా శివయ్య..గంభీరదేహమోడా శివయ్య.. బంభోలనాధుడా శంకరా
మోదుగ మొగ్గలిగ్గు శివయ్య..మారేడు రెమ్మలిద్దు శివయ్య..మనసుపెట్టి మొక్కుకుందూ శంకరాలింగాన సెంబునీళ్లు పొయ్యంగ శరపమయ్య సేదులన్నీ శివయ్య..బాపవయ్య బాధలన్నీ శంకరా
నాగమల్లి పూలు నీకు నాగభరణుడు..తెల్లమల్లి అల్లె జిల్లేడు దెత్తు శివుడాపాలకాయ గొడుగనయ్యా పాలనేత్రుడా.. పాహి పాహి అంటూ వేడుకుందు పాపహరణుడాదయాకరా దిగంబరా హరోంహరా మహేశ్వరా...
జోడె కోడె మొక్కులోడా శివయ్యా.. జోలెపట్టె తిరిగెటోడా శివయ్యా..జోరు జోరు జంగముడా శంకరాలావు లావు జడలవాడా శివయ్య..లావుకోపమేలనీకు శివయ్య.. లావుజాలి కురుపువాడా శంకరా..
ఎండి ఎండి కొండలాడా శివయ్య..చిత్తనైన కండలోడా శివయ్యా..ఎంతమంచి మనసునీది శంకరామేలి మేలి నవ్వులోడా శివయ్య..మేలితీరు లెంచెటోడా శివయ్య..తేడావస్తే ముంచెటోడా శంకరా
అంబరీష నందినీకు వాహనమ్ముగా.. అంబ పార్వతమ్మ తోడుగుండి నడిపినావుగాగంగధరుడా నీది లీల చిత్రమేకదా ..లింగరూపములో లోకమంతా ఏలినోడాదయాకరా దిగంబరా హరోంహరా మహేశ్వరా...
ఒట్టు జాడ తెలవనోడా శివయ్య పట్టువిడుపు తెలిసినోడా శివయ్య పట్టుబట్టలెరుగనోడా శంకరాపంచభూత పాలకుడా శివయ్య పాపమెల్లమోసెటోడ శివయ్య నిన్నుమించె దైవమేల శంకరా
శూలమొక్క సేతబట్టి శివయ్య..ఢమరుకాలు మోతబెట్టి శివయ్య.. సృష్టిని కాపాడుతావు శంకరాజింకతోలు మొలకుచుట్టి శివయ్య..కంచుగజ్జె కాళ్లగట్టి శివయ్య.. పరవశించి ఆడుతావు శంకరా దిక్కుదీము నీవే భీమశంకరా..మొక్కుకున్నవారికెల్ల మోక్షమిచ్చినవారురాఒక్కపొద్దుఉంటే చాలు వెంట ఈశ్వర.. కోరుకున్న వరములిచ్చే భోళా శంకరదయాకరా దిగంబరా హరోంహరా మహేశ్వరా...
అందు ఇందు ఏడ చూడు నువ్వయ్యా..అంతులేని చూపులోడా శివయ్య..అంతరంగమెరిగినోడా శంకరాఅందముల్లా చంద్రరూపం శివయ్య..అందుకోను ధూపదీపం నీవయ్య..రామసక్కని సోమ సుందరా..
స్పీకర్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు దాము రెడ్డి, సంగీత దర్శకుడు మదీన్ ఎస్.కె ఆధ్వర్యంలో రూపొందించిన పాట ఇది. ఈ సాంగ్ చిత్రీకరణలో మంగ్లీ సోదరి ఇంద్రావతి కూడా ఉంది.
గతంలో మంగ్లీ పాడిన శివుడి పాటలు ఇవే...
హరహర మహాదేవ శంకరాహరహర మహాదేవ శంకరాఓ ఓ..! సాధు జంగమా ఆది దేవుడాశంభో శంకర హర లింగ రూపుడాసంచార జగతినావ తోవ నీవురాఆది అంతమేది నీకు లేదురా
అండము నీవే పిండము నీవేఓ ఓ..! ఆత్మవు నీవే పరమాత్మవు నీవేఅఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమేఅతలసుతల పాతాళం నీ కీర్తనమేఒహో..! పగలు రేయి తీరాలకు వారధి నీవేప్రళయ విలయ గమనాలకు సారధి నీవేసాధు జంగమా ఆది దేవుడాశంభో శంకర హర లింగ రూపుడా