Assi ghat : శివరాత్రి రావడంతో వారణాసి లో ఘాట్ లు అన్నీ భక్తులతో కిట కిట లాడుతున్నాయి. కుంభమేళాకు వెళ్ళిన భక్తులు అట్నుంచి ఆటే వారణాసికి వెళ్లి వస్తున్నారు. అయితే తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయం లేని ముఖ్యమైన ఘాట్ ఒకటి కాశీలో ఉంది. నార్త్ లో ఇది చాలా పెద్ద ఫేమస్. ప్రయాగ తరహాలో ఇక్కడ కూడా నదీ సంగమం జరుగుతుంది. అదే "అస్సి " ఘాట్.
Also Read: నదీసాగర సంగమం వద్ద స్నానాలు ఎందుకు చేస్తారు - మహా శివరాత్రి ఎందుకు ప్రత్యేకం!
వరుణ -అస్సీ ల కలయికే వారణాసి
కాశీకి వారణాసి అనే పేరు కూడా ఉందని అందరికీ తెలుసు కదా. అయితే ఆ పేరు రావడానికి కారణం వరుణ -అస్సి అనే నదులు. ఈ రెండు నదుల పేర్లు మీద కాశీకి వారణాసి అనే పేరు ఏర్పడింది. ఈ రెండిట్లో అస్సి నది పేరు పద్మా,మత్స్య,అగ్ని, కూర్మ పురాణాల్లో కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ అస్సీ నది పవిత్ర గంగా నదితో కలిసే ప్రాంతంలో అస్సి ఘాట్ ఉంటుంది. ఇక్కడ రెండు నదుల సంగమాన్ని చూడొచ్చు. ఎక్కడికి దగ్గరలోనే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది. ఘాట్లు అన్నింటిలోనూ దక్షిణం వైపున చివర ఉండే ఘాట్ కావడం తో రిటైర్డ్ ప్రొఫెసర్లు స్టూడెంట్స్ సహా కాశీ నగర వాసులంతా ఉదయం సాయంత్రం వచ్చి ఈ ఘాటు వద్ద కూర్చుంటారు. ఇక్కడ నుంచి గంగానదిని చూడడం అదో అద్భుతమైన అనుభూతి. సగటున 22,500 మంది పర్యాటకులు భక్తులు ఈ ఘాట్ ను రోజు సందర్శిస్తారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ప్రశాంతమైన వాతావరణం తో పాటు ఇక్కడి నుంచి చూస్తే మొత్తం ఘాట్లన్నీ ఒక వరుసలో రాజసం గా కనిపించడం దీనికి కారణం. తన జీవితాంతం కాశీలోని తులసి ఘాట్లో కాలం గడిపిన తులసీదాస్ తన ప్రాణాన్ని వదిలింది మాత్రం ఎస్సీ ఘాట్ లోనే అని ఆయన శిష్యులు చెబుతుంటారు.
Also Read: శివరాత్రి మహత్యాన్ని చెప్పే అద్భుతమైన కథలివి.. లింగోద్భవ సమయానికి ఇలా చేయండి!
దీపావళి అంటే అస్సీ ఘాట్ లో చూడాల్సిందే
కాశీలో దీపావళి ఘనంగా జరిగే ప్రాంతం అస్సీ ఘాట్. ఈ పండుగను ఇక్కడ దేవ్ దీపావళి అని పిలుస్తారు. ఆరోజు సాయంత్రం పూట అస్సిగట్టు మొత్తం దీపాల వెలుతురుతో దీదీప్యమానంగా వెలిగిపోతుంది. అత్యధికంగా ఒకసారి ఆరు లక్షల మంది పర్యాటకులు దేవ్ దీపావళి రోజున అస్సి ఘాట్ సందర్శించినట్టు రికార్డు నమోదయివుంది. గత పదేళ్లు గా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అస్సి ఘాట్ వద్ద "సుభా -యి -బెనారస్ " పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంది. రెండు గంటల పాటు సూర్యోదయం సమయం లో జరిగే ఈ కార్యక్రమానికి ఎంతోమంది హాజరవుతూ ఉంటారు. వేద పఠనం సహా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అందుకే ఈసారి మీరు కాశి వెళ్ళినప్పుడు అస్సి ఘాట్ ను సందర్శించడం మర్చిపోవద్దు.
Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!