Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ ఇంటికి గౌతమ్ వస్తాడు. అందరినీ పేరు పేరున పలకరిస్తాడు. నువ్వు ఎవరు అంటే మహాలక్ష్మీకి బాగా దగ్గరి వాడినని అంటాడు. నువ్వు ఎవరో చెప్పు అంటే నేను చెప్పాలా మహాలక్ష్మీ చెప్పాలా అని ఆలోచిస్తాడు. గౌతమ్ మహాకి చేటు తెచ్చేలా ఉన్నాడని అర్చన మహాలక్ష్మీ గదికి వెళ్తుంది. మహాలక్ష్మీ గోదారి గట్టు మీద రామ చిలుకవే అని పాటలు పెట్టుకొని రిలాక్స్ అవుతుంటుంది.
అర్చనను చూసిన మహాలక్ష్మీ సుమతి పోయింది కదా ఎందుకు వర్రీ ఇక అంతా హ్యాపీ నన్ను టెన్షన్ పెట్టే విషయాలు ఏం లేవని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను అని అంటుంది. దాంతో అర్చన మహాలక్ష్మీతో గౌతమ్ వచ్చాడు అనగానే మహాలక్ష్మీ తడబడుతుంది. కంగారు పడుతుంది. ఇప్పుడేం చేయాలి అని అంటుంది. ఏమైంది అని అంటే నా బతుకుకి ప్రశాంతతే లేదని మహాలక్ష్మీ పరుగులు తీస్తుంది. మహాలక్ష్మీ కంగారుగా పరుగులు తీస్తూ కిందకి వచ్చే సరికి గౌతమ్ కాళ్ల మీద కాళ్లు వేసుకొని రిలాక్స్‌గా సోఫాలో కూర్చొంటాడు.
మహాలక్ష్మీ: ఈ గౌతమ్ గాడు అంతా చెప్పేశాడా ఏంటి. వీడు నా కొంప ముంచడానికే వచ్చేశాడు. వీళ్ల సీరియస్ నెస్ చూస్తుంటే నా పని అయిపోయినట్లుంది. నేనే నిజం చెప్పేయడమే ఇక బెటర్.
జనార్థన్: ఏంటి మహా ఇది.
మహాలక్ష్మీ: జనా అది.. అది..
గిరి: ఈ గౌతమ్ గురించి మా దగ్గర ఎందుకు దాచావ్ వదిన.
రామ్: నువ్వు ముందే చెప్తే బాగుండేది పిన్ని.
సీత: చేసింది అంతా చేసి ఇప్పుడు టెన్షన్ పడతావేంటి అత్తయ్యా.
మహాలక్ష్మీ: సీతకి దొరికేశాను ఇంట్లో ఎవరు క్షమించినా ఇది నన్ను వదలదు.
జనార్థన్: అసలు వీడు ఎవడు మహా.
చలపతి: నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు నీకు అంత దగ్గర బంధువా చెల్లాయ్.
మహాలక్ష్మీ: అంటే గౌతమ్ ఏం చెప్పలేదా.
సీత: మా అందరికీ చిరాకు తెప్పించాడు.
అర్చన: అసలు వీడు ఎవడు మహా.
గౌతమ్: నేను మీకు చెప్తా పిన్ని. నీ మహాలక్ష్మీ కూడా నాకు పిన్ని అవుతుంది. అంటే అమ్మ తర్వాత అమ్మ అన్నమాట.
మహాలక్ష్మీ: వీడు ఎవడో కాదు సీత నా అక్క కొడుకు.
చలపతి: అక్క కొడుకా నాకు తెలీకుండా నీకు అక్క ఎవరు ఉన్నాడు చెల్లాయ్.
మహాలక్ష్మీ: సుభద్ర అక్క కొడుకు అన్నయ్య.
చలపతి: నాకు తెలీదే
మహాలక్ష్మీ: అలివేలు పిన్ని కూతురు అన్నయ్య.
చలపతి: ఓ తనా. మీ అమ్మకి పెళ్లి అయి నువ్వు పుట్టినట్లు కూడా నాకు తెలీదురా. ఓసారి మీ అమ్మకి ఫోన్ చేయ్‌రా మాట్లాడుదాం.
మహాలక్ష్మీ: అన్నయ్య ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ సైలెంట్‌గా ఉండు.
గౌతమ్: మీ అందరి గురించి నాకు బాగా తెలుసు పిన్ని ఎప్పుడూ మీ గురించి తెలుసు. కొన్ని రోజులు ఈ సిటీలో వర్క్ ఉంది బాబాయ్ అందుకే పిన్నిని అడిగి వచ్చాను. నేను ఉండోచ్చు కదా పిన్ని.
అర్చన: కొన్ని రోజులు కాదు ఎన్ని రోజులు అయినా ఉండు గౌతమ్.
గిరి: నువ్వు మహా వదినకు బంధువు అయితే మాకు బంధువే గౌతమ్ ఇది నీ ఇళ్లే అనుకో.
గౌతమ్: పిన్ని కూడా అదే మాట చెప్పింది. ఇది నా ఇళ్లే అని చెప్పింది.
రామ్: ఇన్నాళ్లు మా పిన్నికి మేం తప్ప ఎవరూ లేరు గౌతమ్ ఇప్పుడు మీరు వచ్చారు. పిన్ని చెప్పడం కాదు మీరుఇది మీ ఇళ్లే అనుకోండి.
సీత: వీడి మాటలు నమ్మబుద్ధి కావడం లేదే. పైగా వీడిని ఎక్కడో చూసినట్లు ఉందే.
మహాలక్ష్మీ గౌతమ్‌ని ఫ్రెష్ అవుదువు అని తీసుకెళ్తుంది. ఇక గదిలోకి తీసుకెళ్లి ఎందుకు వచ్చావని తిడుతుంది. సీతకి అనుమానం వచ్చి వెనకాలే వాళ్ల దగ్గరకు వస్తుంది. జాగ్రత్త పడమని మహాలక్ష్మీ గౌతమ్‌తో చెప్పేటైంకి సీత వస్తుంది. ఇద్దరూ సీతని చూసి కంగారు పడతారు. సీత వచ్చి ఏంటి తల్లీ కొడుకులు మాట్లాడుకుంటున్నారు. మీరు తల్లీ కొడుకులే కదా అంటుంది. మహాలక్ష్మీ అరుస్తుంది. అప్పుడు సీత మీ అక్క కొడుకు మీ కొడుకే కదా అంటుంది. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ ఇంటికి వచ్చారా అని సీత గౌతమ్‌ని అడుగుతుంది. దానికి గౌతమ్ మీరు ముంబయి వచ్చారా వచ్చుంటే నన్ను అక్కడ చూసుంటారు అంటాడు. సీతది పక్కా పల్లెటూరి అని అంటుంది. ఇక సీత గౌతమ్‌తో మీరు ముంబయి అయితే ఇంత చక్కగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారేంటి అని అంటుంది.
మహాలక్ష్మీ త్రిలోక్‌కి కలుస్తుంది. ఎందుకు సీతని అరెస్ట్ చేయలేదు అని అంటుంది. ఇంకా బలమైనా సాక్ష్యాలు కావాలి అని త్రిలోక్ అంటాడు. ప్రస్తుతానికి సీతని వడిచిపెడుతున్నా అని పక్కా ఆధారాలతో సీతని అరెస్ట్ చేస్తా అప్పటి వరకు వెయిట్ చేయమని అంటాడు. అప్పటి వరకు గౌతమ్‌ని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. గౌతమ్ మహాలక్ష్మీ గదిలోకి వెళ్లి మహాలక్ష్మీ బీరువాలో డబ్బులు తీసుకోవాలి అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!