Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప జ్యోత్స్నతో ఛాలెంజ్ చేస్తుంది. కార్తీక్ బాబుని గెలిపిస్తానని అంటుంది. జ్యోత్స్న టిఫెన్‌కి డబ్బు అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది. దీప జనాల్ని ఎలా తీసుకురావాలా అని అనుకుంటుంది. మరోవైపు కాశీ దాసుని డాక్టర్‌కి చూపిస్తాడు. రెండు మైండ్‌లతో దాసు ఆలోచిస్తున్నాడు. ఒక మైండ్‌లో మాతో పాటు అందరూ గుర్తున్నారని రెండో మైండ్‌లో మేం ఇద్దరం మాత్రమే గుర్తున్నామని అంటాడు. దాసుకి మెమెరీ రికవరీ అవ్వడానికి టైం పడుతుందని డాక్టర్ చెప్తాడు.
స్వప్న దాసుకి ట్యాబ్టెట్స్ ఇవ్వాలని చూస్తూ అక్కడే పడి ఉన్న పేపర్ చూస్తుంది. ఆ పేపర్లో దీపం బొమ్మ వేసుంటుంది. అది చూసి స్వప్న చూసి దీపం వెలగడం అంటే బతకడం అని అంటుంది. గతంలో రాసిన పేర్లను పోల్చి కూతురు బతికి ఉండటం.. కొట్టిన వాళ్లు బతకడం.. వారసురాలు బతకడం ఇలా ఈ మూడింటిలో ఏమైనా అయింటుందని స్వప్న అంటుంది. ఈ సారి ఏమైనా రాస్తే మూడింటిని డీ కోడ్ చేస్తే అప్పుడు తెలుస్తుందని అనుకుంటారు. శౌర్య అద్దంలో చూసుకుంటూ నేను అందంగా ఉన్నానా.. అని అంటే చందమామలా ఉన్నావని అంటుంది. మా అమ్మ కూడా నాలాగే ఉండేదా అంటే బాగుండేదని అంటుంది. దీప చిన్న నాటి ఫొటో దొరికిందని చెప్తే ఇప్పుడే ఫొటో ఇవ్వు అని అంటే అనసూయ తీసుకొస్తుంది. ఫొటో చూసి శౌర్య మీ అమ్మ నా కంటే చిన్నప్పుడు అందంగా ఉందని అంటుంది. కార్తీక్‌కి చూపిస్తాను అంటే అనసూయ వద్దని కార్తీక్ చిరాకులో ఉన్నాడని చెప్తుంది. ఇక అనసూయ ఆ ఫొటో తీసుకొని అక్కడే పెట్టడంతో అది కింద పడిపోతుంది.
కార్తీక్ తల్లితో జ్యోత్స్న చేసిన మాటల యుద్ధం చెప్తాడు. ఇంతలో శౌర్య వచ్చి అమ్మ చిన్నప్పటి ఫొటో చూస్తావా అంటుంది. కార్తీక్ తర్వాత చూస్తా అంటాడు. ఇక దీప కార్తీక్‌కి టీ ఇస్తుంది. కార్తీక్ టీ తాగుతూ గదిలోకి వస్తే ఫొటో కార్తీక్ కాళ్ల దగ్గర పడుతుంది. కార్తీక్ ఫొటో చూసే టైంకి ఫోన్ రావడంతో ఫొటో పక్కను పెట్టేస్తాడు. తర్వాత ఆ ఫొటో ఎగిరి బెడ్ కింద పడిపోతుంది. మరోవైపు మళ్లీ జ్యోత్స్న కార్తీక్ వాళ్ల రెస్టారెంట్‌కి వచ్చి ఈ రోజు కూడా నేనే ఫస్ట్ కస్టమర్ అనుకుంటుంది. వీళ్ల పని ఈగలు తోలుకోవడం ఈ రెస్టారెంట్‌కి ఎవరు వస్తారు అనుకొని చూసే సరికి చాలా మంది ఉంటారు. టేబుల్స్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటాయి. అది చూసిన జ్యోత్న్స నేను వచ్చింది బావ రెస్టారెంట్‌కేనా అనుకుంటుంది.
ఇంతలో ఓ ఫ్యామిలీ ఫుడ్ చాలా బాగుందని 5 స్టార్ రేటింగ్ ఇస్తామని అంటారు. రాత్రికి రాత్రి ఈ మార్పు ఏంటి అని జ్యోత్స్న అనుకుంటుంది. కార్తీక్ జ్యోత్స్నని చూసి హాయ్ జ్యోత్స్న నీ వల్లే మాకు ఇదంతా సాధ్యం అయింది థ్యాంక్యూ జ్యోత్స్న అంటాడు. ఇక కార్తీక్ జ్యోత్స్నకు ఓ వీడియో చూపిస్తాడు. అందులో జ్యోత్స్న మీ రెస్టారెంట్ ఫుడ్ బాగుందని కానీ నేను బాలేదని ప్రచారం చేస్తా అన్న వీడియో వైరల్ అవ్వడంతో ఇదంతా సాధ్యం అయిందని చెప్తారు. జ్యోత్స్న బిత్తర పోతుంది. కార్తీక్ దగ్గరకు మేనేజర్ వస్తే ఈవిడ మనకు లైఫ్ టైం కస్టమర్ ఎప్పుడు వచ్చిన ఏం తిన్నా ఫ్రీ.. బిల్ తీసుకోవద్దు.. కానీ ఓ వీడియో తీసుకోండి అంటాడు. ఘోరంగా అవమానించారని మీకు వదలను అని జ్యోత్స్న చెప్పి వెళ్లిపోతుంది.
దీప మనసులో జ్యోత్స్నని ఇలా వదిలేశారేంటి జ్యోత్స్న గురించి ఆలోచించరా ఆలోచిస్తే బాగున్ను అనుకుంటుంది. జ్యోత్స్న ఇంటికి వస్తుంది. ఇంట్లో అందరూ జ్యోత్స్న కోసం పెళ్లి సంబంధం తీసుకొస్తారు. పెళ్లి కొడుకు వచ్చి ఇంట్లో కూర్చొంటాడు. ఫొటో చూడగానే నచ్చిందని చరణ్ చెప్పడంతో నా ఫొటో చూడగానే నేను నీకు నచ్చినట్లే చిన్నప్పుడు నుంచి చూస్తూ పెరిగిన మా బావ నాకు ఇంకా నచ్చాడని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!