Ammayi garu Serial Promo Today Episode చనిపోయింది అనుకున్న మందారం బతకడం.. రూప నాట్యం వల్ల లేచి నిలబడిన మందారం నోరు తెరుస్తుంది తల్లీకొడుకుల పని అయిపోయింది అనుకున్న టైంలో మందారం గతం మర్చిపోతుంది. దాంతో విజయాంబిక, దీపక్‌లు తమ నటన షురూ చేస్తారు. ఇంటికి తీసుకొచ్చిన మందారం గతం గుర్తొచ్చి నిజం చెప్తే తమ పని అయిపోతుందని మందారాన్ని చంపేయాలని రకరకాల ప్లాన్లు చేస్తారు. ఇక దీపక్ మందారానికి విడాకుల నోటీసు పంపిస్తాడు. దాంతో సూర్యప్రతాప్‌ దీపక్ మద అరుస్తాడు. ఈ తరుణంలో తాజా ప్రోమో చాలా ఆసక్తికరంగా మారింది.


" సూర్య ప్రతాప్ ఇంటికి లాయర్ నోటీసు వస్తుంది. సూర్యప్రతాప్ తీసుకొని చూస్తే దీపక్ మందారానికి విడాకులు ఇచ్చినట్లు ఉంటుంది. అది చూసిన సూర్య ప్రతాప్ దీపక్‌ని తిడతాడు. ఓరేయ్ బుద్ధి లేని వెధవ మందారం మీద అంత ప్రేమ చూపించావ్ ఇప్పుడు ఎలా విడాకులు ఇవ్వాలి అనిపించిందిరా అని తిడతాడు. విజయాంబిక తమ్ముడు అని అంటే నన్ను అలా పిలవకు అక్క తప్పు చేసిన కొడుకుని మందలించాల్సింది పోయి సపోర్ట్ చేస్తున్నావ్ అని అక్కకి రెండు తిడతాడు. ఇక రెండో ప్రోమోలో రూప దీపక్, విజయాంబికల దగ్గరకు వెళ్లి ఇది వరకు చెప్పిందే మళ్లీ చెప్తున్నా మందారం జోలికి రాకండి.. రేపు కోర్టుకి వెళ్లడానికి రెడీగా ఉండండి అని అంటుంది. దీపక్ వాళ్లు షాక్ అయిపోతారు. ఇంతలో మౌనిక అత్తతో మీరు యాక్టింగ్ చేయడం కంటే దీపక్ చేస్తేనే మంచిది అంటుంది. అప్పుడే దీపక్ ఈ దీపక్ విశ్వరూపం చూడండి అని ఫిట్స్ వచ్చిన వాడిలా బెడ్ మీద పడిపోతాడు. దాంతో విజయాంబిక దీపక్ అని అరుస్తుంది. అందరూ అక్కడికి వచ్చి చూస్తారు. ఇంతలో స్వామీజీ వచ్చి చూసి ఇలాంటి వాళ్లని మామూలు మనుషుల్ని చేయడానికి ఒక్కడున్నాడు అని అనగానే రాజు స్వామీజీలా వస్తాడు. అటాక్ అనగానే అందరూ దీపక్‌ని చితక్కొడతారు. దీంతో ప్రోమో పూర్తయిపోతుంది." 


గత ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..


మందారానికి గతం గుర్తు చేయాలని రూప బయటకు తీసుకెళ్తుంది. అక్కడ రాజు మందారానికి గతం గుర్తు చేయాలని ఫైటింగ్ డ్రామా చేస్తాడు. దాంతో మందారానికి దీపక, విజయాంబిక తమని పొడిచినట్లు గుర్తొచ్చి కళ్లు తిరిగి పడిపోతుంది. ఇంతలో దీపక్ వచ్చి మందారాన్ని తీసుకెళ్లిపోతాడు. సూర్యప్రతాప్‌తో రూప మీద తగిలిస్తారు. దాంతో సూర్య నీకు వెళ్లిపోవాలి అనిపిస్తే వాడితో వెళ్లిపో నా ఇంట్లో ఉండాలి అనుకుంటే ఇంకోసారి వాడిని కలవకూడదని అంటాడు. దాంతో రూప ఆగిపోతుంది. తర్వాత రూప విజయాంబిక, దీపక్‌లకు వార్నింగ్ ఇస్తుంది. మందారానికి గతం గుర్తు రాకుండా, నేను రాజు కలవకుండా ఆపడం కంటే మందారం నిజం  చెప్తే ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకోండి అంటుంది. ఫారెన్ చెక్కేద్దామని దీపక్ అంటాడు. దీపక్ అందుకోసం మౌనికతో పరాయి దేశం వెళ్లడానికి ఏర్పాట్లుచేస్తాం అన్నారు కదా అవి చూసుకో అని మౌనికతో అంటాడు. మౌనిక మనసులో నాకు అంత సీన్ లేదు అనుకుంటుంది. 


రూప రాజుకి కాల్ చేసి మందారాన్ని అడ్డు పెట్టుకొని నిన్ను కలవడానికి వచ్చానని తగిలించారని అంటుంది. మందారానికి గతం గుర్తు రావాలి అంటే బయటకు తీసుకురాకుండా ఇంట్లోనే ప్రయత్నించాలని రాజు అంటాడు. మందారాన్ని ఒంటరిగా వదలొద్దని చెప్తాడు. దీపక్ వాళ్లు ట్రావెల్ ఏజెన్సీని కలుస్తారు. మౌనిక మేడం అంతా చెప్పిందని మీరు మొదటి భార్యకి విడాకులు ఇస్తేనే  వెళ్లగలరని చెప్తారు. దాంతో దీపక్ విడాకులు ఇస్తానని అంటాడు. తర్వాత ఆ ఏజెంట్ మౌనికకి కాల్ చేసి మీరు చెప్పమన్నట్లే చెప్పానని అంటాడు. 


దీపక్ చాటుగా మందారంతో విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టించాలని అనుకుంటాడు. దీపుకి రూప చదివిస్తుంది. ప్రోగ్రస్ రిపోర్ట్ చూసి మంచి మార్కులు రావాలని అంటుంది. ఇక దీపు ప్రోగ్రస్ కార్డు మీద సంతకం పెట్టమంటే రూప సంతకం పెట్టబోతే విజయాంబిక, దీపక్‌లు ఆపి మందారంతో సంతకం పెట్టించమని అంటారు. రూప సంతకం పెట్టమని మందారానికి ప్రోగ్రస్ కార్డు ఇచ్చేసి వెళ్తుంది. మందారం సంతకం పెట్టగానే దీపక్ విడాకుల పత్రాల మీద సంతకం పెట్టించేస్తాడు. ఏం తెలియని మందారం సంతకం పెట్టేస్తుంది. తర్వాత దీపక్ లాయర్‌కి కలిసి త్వరగా విడాకులు ఇప్పించమని అంటాడు. ఉదయం ఇంటికి విడాకులకు సంబంధించిన నోటీసు వస్తుంది. సూర్య చేతిలో ఆ నోటీసు ఉంటే హడావుడిగా దీపక్ తీసుకుంటాడు. దీపక్‌కి అడిగి సూర్య ప్రతాప్ తీసుకొని చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!