నదీసాగర సంగమం..ఇక్కడి పుణ్యస్నానం అత్యంత పవిత్రం..


నదీసాగర సంగమం అంటే పరమ పవిత్రమైనదిగా చెబుతుంటారు.. నది సుదూరం నుంచి ప్రవహించి సముద్రంతో కలిసిపోయినప్పడు అవిభాజ్యమవుతుంది.. సాగర సంగమం నందు నది తన  రూపాన్ని పేరును, రుచిని వదిలిపెట్టి మరిచిపోయి కలిసిపోయినట్లే భక్తులు ఇక తాను అన్న మాట విడిచిపెట్టి పరబ్రహ్మంలో ఐక్యమవుతాడని, అంటే బ్రతికుండగానే జీవన్ముఖుడవుతాడని చెబుతారు. అందుకే నదీసాగర సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఎందుకు ప్రాముఖ్యతనిస్తుంటారు. అందులోనూ మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నదీసాగర సంగమాల వద్ద అయితే మరీ ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. కోనసీమ ప్రాంతంలో మూడుచోట్ల నదీ సాగర సంగమాలు ఉన్నాయి.. అఖండ గోదావరి నుంచి గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలుగా విడిపోయిన గోదావరి కోనసీమ ప్రాంతంలోనే మూడు చోట్ల సాగరంలో మమేకమవుతుంది.. 


Also Read: శివరాత్రి మహత్యాన్ని చెప్పే అద్భుతమైన కథలివి.. లింగోద్భవ సమయానికి ఇలా చేయండి!


అంతర్వేదిలో వశిష్ట నదీసాగర సంగమం..


ధవళేశ్వరం నుంచి వశిష్టా నదిగా విడిపోయిన గోదావరి సిద్ధాంతం, చించినాడల మీదుగా అంతర్వేది వరకు ప్రవహిస్తుంది.. ఇది అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పాలెం వరకు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.. ఈప్రాంతంలోనే భక్తులు ఎక్కువగా పుణ్యసానాలు ఆచరిస్తుంటారు. పైగా అంతర్వేదిలోనే ప్రసిద్ధి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉండడంతో భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలో స్నానమాచరిస్తారు.  ఇక్కడికి చేరుకోవాలంటే అమలాపురం నుంచి అంతర్వేది కు 49 కిలోమీటర్లు రోడ్డుమార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి వచ్చేవారు రావులపాలెం మీదుగా రెండు గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చు. 65కిలోమీటర్లు దూరం కాగా రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇక పాలకొల్లు నుంచి 35 కిలోమీటర్లు దూరం కాగా రోడ్డుమార్గం ద్వారా చేరుకునేందుకు రవాణా సదుపాయాలు చాలా ఉంటాయి.. 


Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!


యానాం వద్ద గౌతమి నదీసాగర సంగమం.. 


ధవళేశ్వరం నుంచి ప్రవహించే గౌతమీ నదీపాయ నేరుగా రామచంద్రపురం, ముక్తేశ్వరం ప్రాంతాల మీదుగా ప్రవహిస్తూ వృద్ధగౌతమి నదీపాయగా మారి పుదుచ్చేరీ యానాం, ఐ.పోలవరం మండలప్రాంతాలను తాకుతూ సాగరంలో కలుస్తుంది.. పుదుచ్చేరీ యానాంలో కానీ, ఇటు కాట్రేనికోన మండలం తీర ప్రాంతంలో కానీ నదీసాగర సంగమం వద్దకు చేరుకోవచ్చు.. యానాం ప్రాంతంలో ఉన్న సాగర సంగమం వద్దకు చేరుకోవడమే సులభం.. అమలాపురం నుంచి కాకినాడ నుంచి, రామచంద్రపురం నుంచి ఇక్కడికి రోడ్డుమార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అమలాపురం నుంచి 32 కిలోమీటర్లు దూరం యానాం ఉండగా బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక రామచంద్రపురం నుంచి 25 కిలోమీటర్లు దూరం.కాకినాడ నుంచి యానాం కు 31.7 కిలోమీటర్లు దూరం కాగా బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి.. 


Also Read: గంగనెత్తికెత్తినోడు , గౌరీదేవి మెచ్చినోడు శివయ్య..ఈ శివరాత్రికి మంగ్లీ సాంగ్ వచ్చేసింది చూశారా!


ఓడలరేవులో వైనతేయ నదీ సాగర సంగమం..


వశిష్టా నదీపాయ గన్నవరం నుంచి విడిపోయి బోడసకుర్రు మీదుగా ఓడలరేవు వరకు ప్రవహించేదే వైనతేయ నదీపాయ.. ఇది అల్లవరం మండలం ఓడలరేవు గ్రామ పరిధిలోను, ఆవలి తీరం అయిన సఖినేటిపల్లి మండలం కేశనపల్లి వద్ద సముద్రంలో కలుస్తుంది. ఇక్కడకు చేరుకోవాలంటే అమలాపురం నుంచి ఓడలరేవు గ్రామానికి 35 కిలోమీటర్లు దూరం కాగా బస్సు సదుపాయం ఉంటుంది.. ఓడలరేవు నుంచి తీరానికి సుమారు 5 కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. పాలకొల్లు నుంచి వై.జంక్షన్‌ వయా మీదుగా 56 కిలోమీటర్లు దూరం ఉంటుంది..