ఫిబ్రవరి 26 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. భవిష్యత్ పై నమ్మకం, శ్రద్ధ పెరుగుతుంది. పనిచేసే ప్రదేశంలో అనవసర చర్చలుంటాయి.. మీ అభిప్రాయాలతో ఏకీభవించరు. విద్యార్థులకు గురువుల పట్ల భక్తి అవసరం. నిర్మాణ రంగంలో ఉండేవారు పురోగతి సాధిస్తారు. 


వృషభ రాశి


ఈ రాశివారిని వెంటాడుతున్న ఆస్తి వివాదాలను పరిష్కారం అవుతాయి. మీ సూత్రాలతో రాజీ పడొద్దు. ఇతరులను మీ వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ మనసులో భావాలు వ్యక్తీకరించడానికి ఇదే ఉత్తమమైన రోజు. 


మిథున రాశి


ఈ రోజు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచండి. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోకుండా నూతన పెట్టుబడులు పెట్టొద్దు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. ఈ రోజు పెద్ద భాగస్వామ్య వ్యాపారాల్లో చేరవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. 


కర్కాటక రాశి


ఆర్థికంగా ఈ రోజు మీకు బావుంటుంది. ఈ రోజు మీరు మీ అభిరుచి కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామి పట్ల గౌరవం పెరుగుతుంది. ఉన్నత విద్యలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. 


Also Read: శివరాత్రి మహత్యాన్ని చెప్పే అద్భుతమైన కథలివి.. లింగోద్భవ సమయానికి ఇలా చేయండి!


సింహ రాశి


ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ సంబంధాలొస్తాయి. విదేశాల్లో చదువుతున్న వారికి ఈ రోజు మంచిది.  ఆలోచనల ప్రవాహం మనస్సులో పెరుగుతుంది. అత్యవసరం అయితే కానీ ప్రయాణం చేయవద్దు. అనవసర వివాదాల్లో చిక్కుకోవద్దు. 


కన్యా రాశి


మీరు పాత స్నేహితులను కలుస్తారు. అన్యాయమైన పనులపై ఆసక్తి చూపవద్దు. యువత వారి కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. సింగిల్ గా ఉండేవారు ప్రేమలో పడతారు. మీరు తక్కువ కృషితో మంచి ఫలితాలు పొందుతారు. 


తులా రాశి


ఈ రోజు మీ పని ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో నిర్ణయాన్ని మార్చుకుంటారు. అది ఆలోచనల కారణంగా నష్టం జరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.


వృశ్చిక రాశి


ఈ రోజు మీ తీరు ప్రశంసలు అందుకుంటుంది.  మీ సూచనల నుంచి చాలామంది మంచి ప్రయోజనాలు పొందుతారు.  వ్యాపారంలో ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. చిన్నారులకు సమయం కేటాయించండి. పనిచేసే ప్రదేశంలో సాంకేతిక సమస్యలుంటాయి. మీడియాలో ఉండేవారికి ఈ రోజు మంచిది 


Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!
 
ధనస్సు రాశి


ఈ రోజు మీ పని సహోద్యోగి కారణంగా నిలిచిపోతుంది. కొన్ని ఆందోళనల ప్రభావం మీపై ఉంటుంది. అతి ఆలోచనలు మనసులోకి రానివ్వవద్దు. సమస్యల నుంచి పారిపోవద్దు..వాటికి పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేయండి.


Also Read: గంగనెత్తికెత్తినోడు , గౌరీదేవి మెచ్చినోడు శివయ్య..ఈ శివరాత్రికి మంగ్లీ సాంగ్ వచ్చేసింది చూశారా!


మకర రాశి


వైవాహిక జీవితం ఈ రోజు సంతోషంగా ఉంటుంది. ఇతరులతో మీ సమన్వయం బావుంటుంది. వ్యాపారం, రాజకీయాల్లో ఉండేవారికి ఈ రోజు  అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాముల నుంచి మీకు చాలా ప్రయోజనం లభిస్తుంది.


కుంభ రాశి


ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు ఈ రోజు పూర్తవుతాయి. నిర్మాణ రంగంతో సంబంధం ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. వ్యాయామం చేయండి.  ప్రేమ వ్యవహరాల్లో కొత్తదనం ఉంటుంది. 


మీన రాశి


ఉద్యోగం మారాలి అనుకుంటే ఇది మంచి సమయం కాదు.  నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. స్నేహితుల నుంచి సహాయం ఆశించేందుకు వెనుకాడరు. ఉన్నతాధికారుల వైఖరి మీపట్ల సానుకూలంగా ఉంటుంది.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


Also Read: పంచారామాలు, పంచభూత లింగాలు మాత్రమే కాదు..పంచకేదార క్షేత్రాల గురించి తెలుసా!