Chanakya Niti In Telugu:  రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేసి ప్రత్యర్థిని చిత్తు చేయగల ప్రజ్ఞ చాణక్యుడి సొంతం. తనను ఘోరంగా అవమానించిన నందరాజులను అణగ దొక్కి, సామాన్యుడిగా బతుకుతున్న చంద్రగుప్తుణ్ని రాజుగా చేసిన ఏకంగా నంద వంశాన్ని భూస్థాపితం చేసిన ఘనత చాణక్యుడిది. వ్యతిరేక పరిస్థితుల్లోనూ చతురతతో లక్ష్యాన్ని సాధించడమే చాణక్యనీతి సూత్రం. అందుకే కొన్ని సందర్భాల్లో విజయం కోసం అడ్డదారిలో వెళ్లినా తప్పులేదంటాడు చాణక్యుడు. కానీ ఎంచుకున్న మార్గం ద్వారా ఇతరులకు ఎలాంటి హాని కలగకూడదని స్పష్టం చేశాడు. 


ఆలోచన భిన్నంగా ఉండాలి


మీరు చూసే, మాట్లాడే, వినే పద్ధతి, ధోరణి అందరిలా కాకుండా వ్యత్యాసంగా వుండాలి. అలాంటప్పుడే ఓ విషయాన్ని గ్రహించడంలో, దాని గురించి మాట్లాడటంతో, ఆ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై భిన్నంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.


Also Read:  వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు


ఇతరుల సంతోషం లైట్ తీస్కోండి


ముందు మీకోసం మీరు బతకడం నేర్చుకోవాలి. మీరు పూర్తిస్థాయిలో సంతోషంగా ఉన్నప్పుడే ఇతరుల జీవితంలో వెలుగు తీసుకురాగలరు అన్న విషయం గుర్తించాలి. అలా కాకుండా ఇతరుల సంతోషం కోసం ఎగబడితే మీరు సాధించేది ఏమీ ఉండదు. పైగా ఇతరుల సంతోషం కోసం బతికే వారిని ఈ లోకం పక్కనబెట్టేస్తుందనే విషయాన్ని గుర్తించాలి.


డబ్బు ప్రాధాన్యతను గుర్తించాలి


చేతిలో డబ్బు ఉన్నప్పుడు భారీగా ఖర్చు చేయడం, లేదనప్పుడు బాధపడడం తగదు. అందుకే ధనానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి. డబ్బు లేనివారికి సమాజంలో సరైన గౌరవం ఉండదు. అందుకే ధనం లేకపోయినా ఉన్నట్టు ఓ మాయను సృష్టించాలి. మీరు సృష్టించే మాయవల్ల ఎదుటివారికి ఎలాంటి నష్టం ఉండదు కదా..పైగా మీకుంటే గౌరవం తగ్గదు. అందుకే ధనం ప్రాధాన్యతను గుర్తించాలి. 


Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!


విజయానికి సమ దూరం


విజయానికి సమ దూరం పాటించడం అంటే ఏంటో తెలుసా... ఇక్కడ విజయాన్ని నిప్పుతో పోల్చుకోవాలి. నిప్పులకు దగ్గరగా వెళితే అది దహించివేస్తుంది - దూరంగా ఉండే ఆహారం సిద్దం కాదు. అందుకే అవసరం అయిన దూరం పాటించినప్పుడు మాత్రమే ప్రయోజనం పొందగలుగుతారు. అందుకే గెలుపు మూలాధారానికి సరి అయిన దూరంలో ఉండాలి.


గతాన్ని గుర్తుచేసుకోవడం బలహీనుల పని


తాను కోల్పోయిన ఆస్తిని తలుచుకుని ఆవేదన చెందకూడదు. గతాన్ని గుర్తుచేసుకుని బాధపడరాదు.  గతాన్ని గుర్తుచేసుకుని బాధపడటం బలహీనులు చేసేపని అని చాణక్య నీతి చెప్తోంది. గతంలో జరిగిన సంఘటనలు మీకు అనుభవంగా మారాలి కానీ బాధపెట్టకూడదని గుర్తుంచుకోండి. 


Also Read: మీ జీవితంలో ఆ ఇద్దరి మీదా ఎప్పుడూ నోరు పారేసుకోవద్దు…ఎవరా ఇద్దరు....చాణక్యుడు ఎందుకలా చెప్పాడు…


ఇలాంటి వారితో స్నేహం వద్దు


మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగినా, పతనం అయిపోయినా అందులో స్నేహితుల పాత్ర తప్పనిసరిగా ఉంటుందంటాడు చాణక్యుడు. అందుకే ధర్మానికి విరుద్ధంగా ఉండే వ్యక్తులతో, అక్రమ మార్గంలో ధనాన్ని పోగేస్ వ్యక్తులతో స్నేహం చేయరాదని చాణక్యుడు హెచ్చరించాడు. అలాంటి వారితో స్నేహం తాత్కాలికంగా మీకు లాభాన్నిచ్చినా భవిష్యత్ లో మీ జీవితాన్ని అంధకారం చేస్తుంది.


ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి


ఏదైనా పని ప్రారంభించినప్పుడు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. 
1. నేనేం చేయాలి?
2. చేసే పనికి ప్రతిఫలం ఏంటి? 
3. నేను చేసే కార్యానికి విలువెంత? 
వీటికి  మీదగ్గరుండే సమాధానమే మీరు తలపెట్టే కార్యం సక్సెస్ అవుతుందా - ఫెయిల్ అవుతుందా అన్నది తేల్చేస్తుంది.


ఆపదను ఎదుర్కోండి
 
సమస్యను చూసి పరిగెత్తకూడదు, అమ్మో అని వెనుకంజవేయకూడదు... ఆపదను ఎదుర్కొనే సత్తా మీకుండాలి. మీ బలహీనతలను, కష్టాలను ఎప్పటికీ మీ ముఖంలో కనిపించనివ్వకూడదు.


Also Read: మీరు తెలివైన వారో కాదో ఇలా తెలిసిపోతుంది - చాణక్యనీతి !


ప్రశంసల కోసం పాకులాడొద్దు


చేసే పని చేయండి కానీ అందులో ప్రశంసలు రావాల్సిందే అనే ఆలోచన మీకు రాకూడదు. పనిపై ఒక్కసారి శ్రద్ధ పెడితే గెలుపు దానంతట అదే వస్తుంది. మీకు గెలుపు ముఖ్యం కానీ వేరొకరు ఇచ్చే ప్రశంసలు కాదని గుర్తుంచుకోవాలి


బలహీనులను తక్కువ అంచనా వేయొద్దు


మీ ప్రత్యర్థి మీకన్నా బలహీనుడని చులకనగా చూడకూడదు. వారిని అంత సులభంగా తీసిపారేయకూడదు. శత్రువులు బలహీనులైతే అది మీకు చాలా ప్రమాదం. వారు మీతో పోటీపడలేరు కాబట్టి మీకు తెలియకుండానే మిమ్మల్ని పడగొట్టే సత్తా వారికి ఉంటుందని గ్రహించాలి. అందుకే స్నేహితులతోనే కాదు శత్రువులతోనూ సన్నిహితంగా ఉండాలి