Chanakya Niti In Telugu:  కేవలం రాజనీతి, అర్థశాస్త్రం గురించి మాత్రమే కాదు మనిషిగా బతికేందుకు,విజయవంతమైన జీవితం గడిపేందుకు అవసరమైన సూచనలెన్నో చేశాడు ఆచార్య చాణక్యుడు. గుప్తుల కాలంలో చాణక్యుడి బోధనలు నేటి తరం కూడా అనుసరించేలా ఉంటాయి. జీవితంలో ఎలా ముందుకెళ్లాలి? ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా నడుచుకోవాలో చాణ‌క్యుడు చ‌క్క‌గా వివరించాడు. లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉన్నవారే కచ్చితంగా విజయం సాధిస్తారన్న చాణక్యుడు..అందుకోసం ప్రణాళిక అవసరం అన్నాడు. ముఖ్యంగా ఈ 5 విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు. 


సూర్యోద‌యానికి ముందే నిద్రలేవాలి


మీరు మీ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే 24 గంటల్లో ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. ఇందులో మొదట చేయాల్సింది తొందరగా నిద్రలేవడం.   మరో ఐదు నిముషాలు మరో ఐదు నిముషాలు అంటూ పొద్దెక్కే వరకూ నిద్రపోకుండా...వేకువ జామునే మేల్కొనాలి. బ్రహ్మ మహూర్తంలో నిద్రలేవడం వల్ల..ఆ రోజు ఏఏ పనులు చేయాలి అనుకున్నారో అవన్నీ సకాలంలో చేయగలుగుతారు.


వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||


 బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపన్నలవుతారని అర్థం. ఈ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేల్కొంటాయి.   ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్య పరుస్తుంది... లేలేమ్మని మేల్కొలుపుతుంది. అందుకే ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుందని చెబుతారు..


Also Read: జీవితంలో ఏ మనిషి చేయకూడని 5 పాపాలు ఇవే!


ప్రణాళిక చాలా అవసరం


సమయానికి నిద్రలేవడం ఎంత ముఖ్యమో... ఆ సయమాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్లాన్ చేసుకోడం మరింత ముఖ్యం. ఒక్క నిముష కూడా వృథా చేయకూడా, సోమరితనం దరి చేరనీయకుండా రోజు మొత్తంలో అనుకున్న పనులన్నీ పూర్తిచేసేయాలి. 


ఏ రోజు పని ఆ రోజే చేయండి


పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందవచ్చు కానీ గడిచిన‌ కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు. అందుకే ఈ రోజు చేయ‌ల్సిన‌ పనిని రేపటికి వాయిదా వేయకూడ‌ద‌ని చాణ‌క్యుడు సూచించాడు. ఈ రోజు ఓ పని వాయిదా పడిందంటే రేపటికి కూడా అదే జరుగుతుందని మర్చిపోరాదు. ముఖ్యంగా సమయాన్ని మీరు గౌరవిస్తే ఆ సమయం మీకు ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది. 


ఆహారం


ఉరుకుల ప‌రుగుల‌ జీవితంలో, తాము తీసుకునే ఆహారం, పానీయాల పట్ల   శ్రద్ధ తగ్గుతోంది. ఏదో ఒకటిలే అని తినేస్తున్నారు. కానీ సమయానికి ఆహారం, సరైన నిద్ర చాలా అవసరం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలరు. 


Also Read: అద్దంలో అలా చూసుకునే అలవాటుందా - అయితే మిమ్మల్ని ఈ దోషం వెంటాడుతుంది!


ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ


శరీరం అనారోగ్యంగా ఉంటే అడుగు ముందుకు పడదు. లక్ష్యంపై శ్రద్ధ ఉండదు. మీ కలలు నిజం కావాలంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. రోజూ ఉదయం యోగా, వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే పూర్తి శక్తితో పని చేయగలుగుతారు.   కాసులు సంపాదనే ముఖ్యం అనుకుంటే కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోలేరని చాణక్యుడు హెచ్చరించాడు....


Also Read: ఈ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు!