కేంద్రంలోని బీజేపీతో ఉప్పు, నిప్పులా ఉంటున్న కేసీఆర్ ( KCR )  ప్రభుత్వం గవర్నర్ తమిళిశై  ( Governer Tamilsai ) విషయంలో ఇటీవల వ్యవహరిస్తున్న విధానం వివాదాస్పదమవుతోంది. తాజాగా గవర్నర్ మేడారం పర్యటనకు ( Medaram Tour ) హెలికాఫ్టర్ కేటాయించకపోవడమే కాదు ఎలాంటి ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయలేదు . దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లడంతో  కేంద్ర ఇంటలిజెన్స్  ( Central Governament ) ఆరా తీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


తొందరపడి సెల్ఫ్ గోల్ చేసుకున్నారా ? ఇప్పుడు జగ్గారెడ్డికి దారేది ?


గవర్నర్ తమిళిశై మేడారం జాతర చివరి రోజు అయిన 19వ తేదీన వెళ్లాలనుకున్నారు. రాజ్‌భవన్ ముందుగానే ప్రభుత్వానికి షెడ్యూల్ పంపారు. హెలికాప్టర్‌ (  Helicopter ) సమకూర్చాలని రాజ్‌భవన్ అధికారులు కోరారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. సీఎం కేసీఆర్ మేడారంకు వెళ్లే అవకాశం ఉందన్న కారణం చెప్పి గవర్నర్‌ను వెయిట్ చేయించారు. చివరికి  రోడ్ మార్గం ద్వారా గవర్నర్ మేడారం చేరుకున్నారు. నిజానికి కేసీఆర్ 18వ తేదీన మేడారం వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ వెళ్లలేదు. కారణాలేమిటో కూడా స్పష్టత లేదు. 


ఈసీని లైట్ తీసుకున్న రాజాసింగ్ - "బుల్డోజర్" హెచ్చరికలపై కేసులు నమోదు !


 ప్రభుత్వం హెలికాఫ్టర్‌ విషయంలో స్పందించకపోవడంతో  ఉదయం పదకొండు గంటలకు చేరుకోవాల్సిన గవర్నర్ ప్రభుత్వం హెలికాఫ్టర్ ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి చేరుకున్నారు.అయితే మేడారంలో గవర్నర్‌కు ప్రోటోకాల్ ( Protocal ) దక్కలేదు. ప్రొటోకాల్‌ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా హాజరై ఆహ్వానించాల్సి ఉన్నా ఎవరూ రాలేదు. జాయింట్‌ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క ( MLA Seetakka ) మాత్రమే స్వాగతం పలికారు. స్వాగతం, వీడ్కోలు కార్యక్రమాలకు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ గైర్హాజరు కావడంపై అప్పుడే విమర్శలు వచ్చాయి. కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతంలో గవర్నర్‌ పర్యటనను తీసుకున్నారని ఈ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 


ప్రకాశ్‌రాజ్‌‌కు కేసీఆర్ బంపర్ ఆఫర్? ముంబయి టూర్‌లో అందుకే అలా జరిగిందా?


గవర్నర్‌ కార్యాలయం ( Raj Bhavan ) ముందు ఫిర్యాదుల బాక్స్‌ ఏర్పాటు చేయడం, కోవిడ్‌ పేరుతో జనవరి 26 వేడుకలను రాజ్‌భవన్‌కు మాత్రమే పరిమితం చేయడం వంటి విషయాలపై ప్రభుత్వం, గవర్నర్‌కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అవి అంతకంతకూ పెరుగుతున్నారు. ఇటీవల కేసీఆర్ గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.