తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథ్ పై ( Raja Singh Lodh ) హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ( UP Elections )  సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ( EC ) వివరణ అడుగుతూ నోటీసులు జారీ చేసింది. అయితే రాజా సింగ్ వాటిని పట్టించుకోలేదు. ఈసీకి వివరణ ఇవ్వలేదు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.  72 గంటల పాటు రాజా సింగ్ ఏ రూపంలోనూ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. 


బుల్డోజర్‌ రాజాసింగ్‌"కు ఈసీ నోటీసులు - తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న ఎమ్మెల్యే !


 యూపీ ఓటర్లను ఉద్దేశించి ఇటీవల రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. అందులే ''యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ( CM Aditynadh ) వేలాది సంఖ్యలో జేసీబీలు, బుల్డోజర్లు తెప్పిస్తున్నారు. ఎన్నికల తర్వాత యోగికి మద్దతు ఇవ్వని ప్రాంతాలన్నింటినీ గుర్తిస్తారు. జేసీబీలు, బుల్డోజర్లు ఎందుకు పనికొస్తాయో తెలుసు కదా. యూపీలో ఉండాలంటే యోగి, యోగి అనాల్సిందే. లేదంటే ఉత్తర్‌ ప్రదేశ్ వదిలేసి పారిపోవాల్సి ఉంటుంది'' అని హెచ్చరించారు. ఈ వీడియో వైరల్ అయింది. ఎన్నికల సంఘానికి పెద్దున ఫిర్యాదులు వెళ్లాయి. రాజాసింగ్ వ్యాఖ్యలు మోడల్ కోడ్ ఆఫ్ కండ కండక్ట్‌ను ( Model Code Of Conduct ) ఉల్లంఘించడమేనని ఈసీ తేల్చింది. అయితే ఈసీని పరిగణనలోకి తీసుకోలేదు రాజాసింగ్. 


దేవీశ్రీ ప్రసాద్ ఐటమ్ సాంగ్ వ్యాఖ్యల వివాదం... హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్...


ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన రాజాసింగ్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పదహారో తేదీన ఆయనకు ఈసీ నోటీసు జారీ చేసి ఒక్క రోజు సమయం ఇచ్చింది . ఇరవై నాలుగు గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆ నోటీసు వచ్చినప్పుడు రాజాసింగ్ మీడియాతో మాత్రం మాట్లాడారు. తన వ్యాఖ్యలపై కుట్రలు చేస్తున్నారని  ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ( Uttar Pradesh ) యోగి ప్రభుత్వం రౌడిషీటర్లను అణిచివేసిందని ఆ కోణంలోనే తాను చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు. అదే విషయాన్ని ఆయన ఈసీకి చెప్పలేదు. దాంతో కేసు నమోదు చేయాల్సి వచ్చింది. 


రాజాసింగ్‌కు వివాదాస్పద వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అలాంటి ప్రకటనలతోనే ఆయన రాజకీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కరుడు గట్టిన హిందూత్వ ప్రకటనలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనపై ఎన్నో కేసులు ఉన్నాయి. అయినా ఆయన పద్దతి మార్చుకోరు.