ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ పుష్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఐటమ్ సాంగ్, దేవుళ్ల పాటలు ఒకటే అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. దేవీశ్రీ ప్రసాద్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దేవీశ్రీ ప్రసాద్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...లారీని ఢీకొట్టిన కారు, ఆరుగురి మృతి
పుష్ప సాంగ్ పై కూడా వివాదం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీకి సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. కానీ సినిమాలో స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా ఉఊ అంటావా'పై వివాదం చెలరేగింది. మగవాళ్లను తప్పుబట్టే విధంగా ఉందని పురుషసంఘాలు కోర్టుకెక్కాయి. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన దేవీశ్రీ ప్రసాద్.. తనకు ఐటమ్ సాంగ్, డివోషనల్ సాంగ్స్ రెండూ ఒక్కటే అన్నారు.
Also Read: ఆ అమ్మాయిలు రాత్రి మద్యం సేవించారు.. ఆపై నా మాట వినలేదు.. జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధు ఆవేదన
దేవీశ్రీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఐటమ్ సాంగ్స్ రింగ రింగా, ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా, ఈ రెండు పాటలను భక్తి పాటలుగా భావిస్తానని, వాటి లిరిక్స్ మార్చి పాడాడు దేవీశ్రీ ప్రసాద్. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పాట పాడుకోండి కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పాడకండని ట్రోల్ చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచారంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత కూడా క్షమాపణలు చెప్పాలని సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ను హెచ్చరించారు. పుష్ప సినిమా ఐటమ్ సాంగ్‌లో పదాలను దేవుడి శ్లోకాలతో పోల్చటాన్ని ఖండించారు. దేవీశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారని, వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు వివాదంగా మారుతున్న ఈ వ్యవహారంపై దేవీశ్రీ ప్రసాద్ ఎలా స్పందిస్తున్నారో ఆసక్తికరంగా మారింది.
Also Read: బెజవాడ 'ఖాకీ'ల సాహసం... గుజరాత్ వెళ్లి చెడ్డీ గ్యాంగ్ కు వల ... ముగ్గురు నిందితులు అరెస్టు