2024 Corona : మరో రెండేళ్లు కరోనా వదలదట.. ఫైజర్ పరిశోధనలో కీలక అంశాలు

2024 వరకు కరోనా ప్రపంచంపై ప్రభావం చూపుతూనే ఉంటుందని ఫైజర్ అంచనా వేసింది. చిన్న పిల్లల వ్యాక్సిన్లను సిద్ధం చేసేందుకు ఫైజర్ తీవ్రంగా శ్రమిస్తోంది.

Continues below advertisement


కరోనా మహమ్మారి 2024 వరకు ప్రపంచాన్ని వదిలి పెట్టదని దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్ అంచనా వేస్తోంది. కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తూండటం.. పిల్లలకు వేసే వ్యాక్సిన్ల విషయంలో అనుకున్న విధంగా పురోగతి లేకపోవడమే దీనికి కారణంగా విశ్లేషిస్తోంది. ఫైజర్ సంస్థ ఇటీవల రెండు నుంచి నాలుగేళ్ల లోపు చిన్నారుల కోసం వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అందులో సంతృప్తికరమైన ఫలితాలు రావడం లేదు. అంచనా వేసిన దాని కన్నా చాలా తక్కువ స్థాయిలో వ్యాధి నిరోధకత వ్యాక్సిన్ల ద్వారా వస్తున్నట్లుగా గుర్తించారు. ఈ కారణంగా వ్యాక్సిన్లకు గుర్తింపు కూడా లభించడం లేదు. 

Continues below advertisement

Also Read: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి.... హర్షం వ్యక్తం చేసిన అదర్ పునావాలా

ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో వచ్చే ఒకటి, రెండేళ్ల పాటు కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ఫైజర్ చెబుతోంది. చాలా దేశాల్లో పాండమిక్ ఎండమిక్ స్టేజ్‌కు వచ్చిందని అంచనా వేస్తున్నారు. కానీ అలాంటి దేశాల సంఖ్య చాలా స్వల్పమని ఫైజర్ చీఫ్ సైంటిస్ట్ చెబుతున్నారు. కరోనా పాండమిక్ ఎండమిక్‌ స్టేజ్‌కు రావాలంటే కొత్త వేరియంట్ల ప్రభావం, వాటిని వ్యాక్సిన్లు ఎలా ప్రతిఘటిస్తాయి.. అలాగే చికిత్స.. అతి తక్కువగా వ్యాక్సినే,న్ జరిగిన ప్రాంతాలకు వ్యాక్సిన్లు అందించడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుందని ఫైజర్ సంస్థ చెబుతోంది. 

Also Read: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇక మహమ్మారి చివరి స్థాయికి వచ్చిందని అమెరికా సుప్రసిద్ధ వైద్యుడు అంటోనియో ఫౌచీ విశ్లేషించారు. అమెరికాలో వచ్చే ఏడాది కల్లా కరోనా ఉండదని ఆయన చెబుతున్నారు. ఫజర్ ఇప్పటికే ఐదేళ్లకు పైబడిన పిల్లల కోసం వ్యాక్సిన్లను సిద్ధం చేసింది. అనుమతి కూడా పొందింది. అమెరికాలో పంపిణీ చేస్తోంది. మూడు మైక్రో గ్రాముల వ్యాక్సిన్ ఐదేళ్ల పైబడిన చిన్నారులకు ఇస్తే మంచి రోగనిరోధకశక్తి వెల్లడవుతోంది. కానీ అదే రెండు నుంచి నాలుగేళ్ల లోపు పిల్లలకు ఇస్తే అలాంటి ఫలితం రావడంలేదు 

Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్

వచ్చే ఏడాదిలో రెండేళ్ల పిల్లలకు ఇచ్చే కోవిడ్ వ్యాక్సిన్‌కు అనుమతి పొందేలా ఫైజర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈవ్యాక్సిన్ మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. బయోన్‌టెక్‌తో కలిసి ఫైజర్ ఇప్పటికే ఓమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే వైరస్‌పై పరిశోధనలు ప్రారంభించింది. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం లేదు. 

Also Read: తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్‌ కేసులు... 7కు చేరిన మొత్తం కేసులు

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement