దేశంలో దాదాపు అంతా కోవిడ్-19 రెండు వ్యాక్సిన్ డోస్‌లు తీసుకున్నారు. దీంతో చాలామంది.. ఇక వైరస్ సోకినా త్వరగా కోలుకోవచ్చనే ధైర్యంతో బతికేస్తున్నారు. కొందరైతే వ్యాక్సిన్ తీసుకున్నాం.. మనకేమీ కాదనే ధైర్యంతో మాస్కులు లేకుండానే మూర్ఖంగా తిరిగేస్తున్నారు. అలాంటి మూర్ఖులకు World Health Organization (WHO) ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. అది తెలిసిన తర్వాత కూడా మాస్కులు పెట్టుకోకుండా తిరిగితే.. భారీ మూల్యమే చెల్లించుకోవాలి.
ప్రస్తుతం ప్రపంచాన్ని మరో ‘ఒమిక్రాన్’ (Omicron) అనే కొత్త వేరియెంట్ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అది ఇండియాకు కూడా దిగుమతై.. వేగంగా వ్యాపిస్తోంది. అయితే, ఈ వేరియెంట్‌ను చాలామంది తేలిగ్గా తీసుకుంటున్నారు. దీనివల్ల మరణాలు తక్కువగా ఉన్నాయనే సమాచారం ప్రజల్లో మరింత ధైర్యాన్ని నింపుతోంది. అయితే, ఒమిక్రాన్(Omicron)ను తక్కువ అంచనా వేయొద్దని WHO చెబుతోంది. డేల్టా వేరియెంట్ కంటే ఎక్కువ మ్యూటెంట్స్ ఉన్న ఈ వేరియెంట్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. పైగా, డెల్టా వేరియెంట్ కూడా ఇంకా ఉనికిలో ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ రెండి వేరియెంట్లు కలిసి దాడి చేస్తే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని సూచిస్తోంది.
Read also: భోజనం మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
WHO ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఇండియాలో తీసుకున్న Covid-19 వ్యాక్సిన్లు ఈ వేరియెంట్‌పై తక్కువ ప్రభావం చూపుతాయి. ఇది రీఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని కలిగి ఉన్నట్లు తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్‌లు లేదా గతంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ చికిత్స కారణంగా పొందిన రోగనిరోధక శక్తిని ఒమిక్రాన్(Omicron) ఎంతవరకు తప్పించుకోగలదో తెలుసుకోడానికి మరింత డేటా అవసరమని పేర్కొంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నా.. ఒమిక్రాన్ బారిన పడే అవకాశాలు ఉన్నట్లు WHO స్పష్టం చేసింది. GISAID గ్లోబల్ సైన్స్ డేటాబేస్‌లో రిజిస్టర్ చేసిన డెల్టా వేరియెంట్ల సీక్వెన్స్‌ల శాతం ఇతర ఆందోళనకర వేరియంట్‌లతో పోల్చితే ఈ వారం క్షీణించిందని పేర్కొంది. డెల్టా(Delta) వేరియంట్ ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలోనే ఉందని, ప్రజలు మాస్క్, శానిటైజేషన్ తప్పకుండా పాటించాలని హెచ్చరించింది.
Also Read: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. ఆపండ్రా మీ అరాచకం!
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి