ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీపై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. యూపీలో ఎక్కడా బాహుబలి లేదని, బజరంగ్‌బలి మాత్రమే ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీతాపుర్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు యూపీలో ఎక్కడా 'బాహుబలి' అనే మాట లేదు. ఉన్నది 'బజరంగ్‌బలి' మాత్రమే. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు.. మన సాయుధ బలగాలను అవమానించాయి. ఉగ్రవాదులను జైలు నుంచి బయటకు తీసుకొచ్చాయి. కానీ భాజపా మాత్రం పేద, యువత, మహిళల కోసం పని చేస్తోంది. నాకు కళ్లద్దాలు ఉన్నాయి. ఇందులోంచి చూస్తే అంతా స్పష్టంగా కనిపిస్తోంది. అఖిలేశ్ బాబు కూడా కళ్లద్దాలు పెట్టుకుంటారు. మతం, కులం అనే కళ్లద్దాలు ఆయన పెట్టుకుంటారు. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఏంటీ బాహుబలి?
యూపీలో బాహుబలి మాట ఎక్కడా వినపడదని అమిత్ షా చేసిన కామెంట్లు కొత్తేం కాదు. ఇంతకుముందు కూడా అమిత్ షా ఇలా అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు ఓ బాహుబలి (మాఫియా, గూండా) ఉండేవాడు. కానీ యోగి పాలనలో అలాంటి మాఫియా లేదు. కేవలం బజరంగ్ దళ్ ఉంది. అఖిలేశ్ సర్కార్.. ఇలాంటి మాఫియా, బాహుబలులకు గ్రీన్ లైట్ చూపించి.. అభివృద్ధికి రెడ్ లైట్ చూపించేంది. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
Also Read: Fodder Scam Case: లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష- దాణా కుంభకోణం కేసులో కోర్టు తీర్పు