UP Polls 2022: సాగు చట్టాలలానే 'బాబా బుల్డోజర్' కూడా వెనక్కి వెళ్లిపోతారు: అఖిలేశ్

ABP Desam   |  Murali Krishna   |  20 Feb 2022 08:21 PM (IST)

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ సెటైర్లు వేశారు. ఎన్నికలు పూర్తయ్యాక 'బాబా బుల్డోజర్' కూడా వెనక్కి వెళ్లిపోతారని విమర్శలు చేశారు.

అఖిలేశ్ యాదవ్

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే నేతల మధ్య మాత్రం మాటల తూటాలు పేలుతున్నాయి. అయోధ్యలోని రుదౌలీలో జరిగిన ర్యాలీలో అఖిలేశ్ యాదవ్.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సెటైర్లు వేశారు. కొత్త సాగు చట్టాలలానే 'బాబా బుల్డోజర్' కూడా వెనక్కి వెళ్లిపోతారని అఖిలేశ్ అన్నారు. 

భాజపా నేతలు ఇప్పుడిప్పుడే ఏ,బీ,సీ,డీలు నేర్చుకుంటున్నారు. వాళ్లకు నేను ఓ విషయం చెప్పదలచుకున్నాను. నల్ల సాగు చట్టాలు వెనక్కి వెళ్లినట్లే, బాబా (యోగి) కూడా వెళ్లిపోతారు. ఆయన (యోగి) ప్రతిదాని పేరు మార్చేస్తారు. ఇప్పటివరకు ఆయన్ను 'బాబా ముఖ్యమంత్రి'గా పిలుస్తున్నాం.. కానీ ఈ మధ్య ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఆయన్ను 'బాబా బుల్డోజర్' అని రాసింది. ఇది నేను పెట్టిన పేరు కాదు. కానీ ఈ బాబా బుల్డోజర్ కచ్చితంగా వెనక్కి వెళ్లిపోతుంది.                                                            -   అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత

ప్రశాంతంగా పోలింగ్

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 627 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 57.44 శాతం ఓటింగ్​ నమోదైంది.                   

Also Read: Covid Update: దేశంలో 20 వేలకు దిగువనే కరోనా కేసులు- 673 మంది మృతి

Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 
Published at: 20 Feb 2022 08:19 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.