దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులోకి వచ్చింది. కొత్తగా 19,968 కరోనా కేసులు నమోదయ్యాయి. 673 మంది మృతి చెందారు. 48,847 మంది కరోనా నుంచి కోలుకున్నారు.







యాక్టివ్ కేసుల సంఖ్య 2,24,187కు చేరింది. మొత్తం రికవరీల సంఖ్య 4,20,86,383కు పెరిగింది. మరణాల సంఖ్య 5,11,903 వద్ద ఉంది.


డైలీ పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.27%గా ఉంది.


వ్యాక్సినేషన్







దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. కొత్తగా 30,81,336 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,37,22,697కు చేరింది.


ఆంక్షలు సడలింపు


దేశంలో రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ రాత్రి కర్ఫ్యూను ఎత్తివేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు తగ్గుతున్నందున రాష్ట్రాలు ఆంక్షలు సడలించాలని ఇటీవల కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. శనివారం 22,270 కరోనా కేసులు నమోదయ్యాయి.


Also Read: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, వరుడు సహా 9 మంది దుర్మరణం