ABP  WhatsApp

Election Results 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Punjab Election 2022: సోనూసూద్‌ కారు సీజ్- ఇంటి నుంచి బయటకు రావద్దని ఈసీ వార్నింగ్

ABP Desam Updated at: 20 Feb 2022 04:29 PM (IST)
Edited By: Murali Krishna

సోనూసూద్‌ కారును అధికారులు సీజ్ చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు సోనూసూద్‌ ప్రయత్నించినందుకే ఇలా చేసినట్లు అధికారులు తెలిపారు.

సోనూసూద్‌కు ఈసీ షాక్

NEXT PREV

యాక్టర్ సోనూసూద్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుండగా పోలింగ్​ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సోనూసూద్‌ను అధికారులు అడ్డుకున్నారు. కారును సీజ్ చేసి ఆయన్ను తిరిగి ఇంటికి పంపించారు. ఇంటి నుంచి బయటకు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఏం జరిగింది?


సోనూసూద్ సోదరి మాల్విక సూద్​ మోగా స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈరోజు పోలింగ్​ జరుగుతోన్న సమయంలో నియోజకవర్గంలోని ఓ పోలింగ్​ కేంద్రానికి వెళ్లేందుకు సోనూసూద్​ ప్రయత్నించినట్లు జిల్లా పీఆర్​ఓ తెలిపారు.



ఓ పోలింగ్​ కేంద్రానికి ప్రవేశించేందుకు సోనూసూద్​ ప్రయత్నించారు. అధికారులు అడ్డుకని సోనూసూద్ కారును స్వాధీనం చేసుకుని తిరిగి ఇంటికి పంపించారు. తన ఇంటి నుంచి బయటకు వస్తే తగిన చర్యలు తీసుకుంటాం.                                                                 - మోగా పీఆర్‌ఓ


రియాక్షన్






ఈ వార్తలపై సోనూసూద్ స్పందించారు. ఎన్నికల పోలింగ్ కేంద్రంలో అకాలీ దళ్‌కు చెందిన వారు ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిసి వెళ్లినట్లు పేర్కొన్నారు. 



పోలింగ్ కేంద్రాల్లో డబ్బులు పంచుతున్నారు. అకాలీ దళ్‌కు చెందిన వారు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను బెదిరిస్తున్నారు. అలాంటి ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేయటం, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడటం మన బాధ్యత. అందుకోసమే ఇంటి నుంచి బయటకు వెళ్లాం. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాం.                                                   - సోనూసూద్​, నటుడు


Also Read: Covid Update: దేశంలో 20 వేలకు దిగువనే కరోనా కేసులు- 673 మంది మృతి


Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Published at: 20 Feb 2022 04:22 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.