UP Election 2022: 'ఆఫ్ట్రాల్ కాదు సర్- 'సైకిల్'ను అవమానిస్తే దేశాన్ని అవమానించినట్లే'

ABP Desam   |  Murali Krishna   |  21 Feb 2022 04:18 PM (IST)

ప్రధాని నరేంద్ర మోదీ యూపీ ప్రచార సభలో చేసిన 'సైకిల్' వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఫైర్ అయ్యారు. సైకిల్ సామాన్యుల సవారీగా పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి అఖిలేశ్ కౌంటర్

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కింది. భాజపా, సమాజ్‌వాదీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల.. సైకిల్ గుర్తుపై చేసిన విమర్శలకు సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.

సైకిల్ రైతులను పొలాలకు చేరుస్తుంది. వారి అభివృద్ధికి పునాది వేస్తుంది. మన పిల్లలను పాఠశాలలకు చేరుస్తుంది. ద్రవ్యోల్బణం ప్రభావం దీనిపై ఉండదు. సైకిల్ సామాన్యుల ఎయిర్‌క్రాఫ్ట్. గ్రామీణ భారతానికి గుర్తు. అలాంటి సైకిల్‌ను అవమానించడం దేశాన్ని అవమానించడమే.                                                          -   అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత 

సైకిల్‌పై విమర్శలు

యూపీలోని హర్దోయ్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా తీర్పు వచ్చిన అహ్మదాబాద్‌ బాంబు పేలుళ్ల ఘటన గురించి మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్‌'ను ప్రస్తావించారు. 2008లో జరిగిన పేలుళ్లకు ఉగ్రవాదులు సైకిళ్లను వినియోగించారని, వారు సైకిళ్లను ఎందుకు ఎంచుకున్నారో ఆశ్చర్యంగా ఉందని పేర్కొంటూ ఎస్పీ గుర్తుకు అన్వయించే ప్రయత్నం చేశారు.

బాంబు దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల పట్ల కొన్ని పార్టీలు సానుభూతి చూపుతున్నాయని మోదీ ఆరోపించారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన కొన్ని ఉగ్రదాడులకు కారణమైన వారిపై కేసులను కొట్టివేయాలని అప్పటి సమాజ్​వాదీ పార్టీ ప్రయత్నించినట్లు మోదీ అన్నారు.

Also Read: Fodder Scam Case: లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష- దాణా కుంభకోణం కేసులో కోర్టు తీర్పు

Also Read: Anti-BJP Front: కేసీఆర్- ఠాక్రే భేటీపై శివసేన కీలక వ్యాఖ్యలు- కాంగ్రెస్ లేకుండా పొలిటికల్ ఫ్రంట్‌కు ఊఊ!

Published at: 21 Feb 2022 04:18 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.