న్యూజిలాండ్‌లో ట్రేడ్‌మీ అనే వెబ్ సైట్ పాపులర్. మన దేశంలో ఓఎల్‌ఎక్స్ లాగా అక్కడ కూడా పాత సామాన్లు.. సెకండ్ హ్యాండ్ సామాన్లు పెడుతూ ఉంటారు. కావాల్సిన వాళ్లు కొనుక్కుంటూ ఉంటారు. అలాంటి వెబ్‌సైట్‌లో హఠాత్తుగా ఓ యాడ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అ వస్తువు పేరు " హస్బెండ్".  అంటే భర్తే. ఓ మహిళ తన  భర్తను అలా అమ్మకానికి పెట్టేసిందన్నమాట. అతని ఫోటో పెట్టి కింద.. పెళ్లి చేసుకున్న మూడేళ్ల తర్వాత లిండా మెక్‌అలిస్టర్ తన భర్తను అమ్మకానికి పెట్టారని..ఆయన బీఫ్ ఫార్మర్ అని.. డిస్క్రిప్షన్ కూడా రాశారు.


Also read: అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్‌... ఇమ్యూనిటీ పెరగడంతో పాటూ ఇంకా ఎన్నో లాభాలు


తన  భర్త గురంచి ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. తన వయసు 37 ఏళ్లు అని.. ఆరు అడుగులు దాటి ఒక్క అంగుళం పొడుగు ఉంటారని లిండా చెప్పుకొచ్చింది. అంతే కాదు.. ఇంతకు ముందు అతను సెకండ్ హ్యాండ్ కాదని గతంలో చాలా మంది ఓనర్లు ఉన్నారు కానీ కొనుగోలు చేసిన వారి పట్ల లాయల్‌గా ఉంటారని సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే మరి ఎందుకు అమ్మకానికి పెడుతున్నారో కూడా తెలియాలి కాబట్టి.. అది కూడా చెప్పింది. పిల్లల్ని అప్పుడప్పుడు కూడా చూసుకోకుండా.. ఫిషింగ్‌కు వెళ్లిపోతున్నాడని.. అందుకే అమ్మకానికి పెడుతున్నానని చెప్పేసుకుంది. 


Also read: తిని పడేసే చాక్లెట్ రేపర్‌పై దేవుడి ఫోటో... ఏకిపడేసిన నెటిజన్లు, సారీ చెప్పిన నెస్ట్లే ఇండియా


ఇలా తాను భర్తను అమ్మకానికి పెట్టిన విషయం భర్త జాన్‌కు చెప్పలేదు. అయితే తనను అమ్ముతున్న విషయం ఆయనకు తెలియకుండా ఉంటుందా.. చూసిన వాళ్లు ఆయనకు చెప్పారు. అయితే ఆయన సీరియస్‌గా తీసుకోలేదు. నవ్వేసి లైట్ తీసుకున్నారు. ఎందుకంటే తన భార్య తనను అమ్మేస్తుందని ఆయన అనుకోవడం లేదు.  ప్రాక్టికల్ జోక్ చేస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఆయనకు మంచి బేరం వచ్చిందో లేదో కానీ.. ఈ యాడ్ గురించి కంప్లైంట్లు రావడంతో ట్రేడ్‌మీ యాప్ దాన్ని తొలగించింది. 


Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు




అయితే లిండా తన భర్తను నిజంగానే అమ్మకానికి పెట్టలేదని.. అది ప్రాక్టికల్ జోక్ అని..  ఆ యాడ్ ఉన్నప్పుడు చూసి.. కాల్ చేసిన వారికి వచ్చిన రిప్లయ్‌తో తేలిపోయింది. అయితే ఆ భర్తకు మాత్రం ఓ భయం కల్పించడంతో లిండా సక్సెస్ అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకెప్పుడూ పిల్లల్ని చూసుకోవాల్సిన సమయంలో వదిలేసి పోరని  భావిస్తున్నారు. 








ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.