కరోనా వైరస్ వేరియంట్లు ఒక దాని తర్వాత ఒకటి పుట్టుకుంటూ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అలా వేరియంట్లకు కూడా కొత్త వేరియంట్లు పుట్టుకు రావడం కొత్త పరిణామం. యూకేలో కొత్తగా BA.2 అనే రకం వైరస్‌ను కనిపెట్టారు. ఇప్పటికే ఇది 426 మందికి సోకినట్లుగా గుర్తించారు. ఇది కరోనానే అయితే.. కరోనా వేరియంట్ అయిన ఒమిక్రాన్ వేరియంట్‌గా గుర్తించారు. ఇప్పటికి మన దేశంలో కూడా డిటెక్ట్ అయినట్లుగా తేల్చారు.
Also Read: దేశంలో మళ్లీ మూడు లక్షలు దాటిన కేసులు.. అదే స్థాయిలో ఒమిక్రాన్ కేసులు పెరుగుదల
బీఏ.2 రకం వైరస్‌ను యూకే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది ఒమిక్రాన్ తరహాలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే అంత ప్రమాదకరంగా మాత్రం గుర్తించలేదు. ఒమిక్రాన్ తరహాలో మ్యూటేషన్లు ఇందులో ఎక్కువ లేవు. యూకే శాస్త్రవేత్తలు ఇప్పటికే యూకేతో పాటు డెన్మార్క్, ఇండియా, UK, స్వీడన్ మరియు సింగపూర్‌లో ఈ కేసులు విస్తరిస్తున్నాయని అంచనా వేశఆరు. డెన్మార్క్‌లో అత్యధిక కేసులు ఉన్నట్లుగా తెలుస్ోతంది. డెన్మార్క్ BA.2 కారణంగా కొత్త కేసుల సంఖ్యలో నిరంతర పెరుగుదల ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also read: అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్... ఇమ్యూనిటీ పెరగడంతో పాటూ ఇంకా ఎన్నో లాభాలు
డెన్మార్క్‌లో ఇప్పుడు నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం బీఏ.2 రకానికి చెదినవే. డెన్మార్క్ సైంటిస్టులు ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌కు రెండు మ్యూటేషన్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికి మొత్తం నలభై దేశాలకు ఈ బీఏ.2 వ్యాప్తి చెంది ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డెన్మార్క్ యంత్రాంగం అంతా ఈ కొత్త రకం వేరియంట్ మీద పరిశోధనలు చేస్తోంది.
కరోనా పుట్టిన తర్వాత పలు రకాల వేరియంట్లు పుట్టుకొచ్చాయి. అయితే వేరియంట్‌కు వేరియంట్ పుట్టడం బహుశా ఇదే ప్రథమం అని అంచనా వేస్తున్నారు. ఈ వేరియంట్ల కారణంగా కరోనాను అంతం చేయడం సాధ్యం కాదని... వాటితో కలిసి జీవించాల్సిందేనని ప్రపంచ దేశాలు రియలైజ్ అవుతున్నాయి. కొత్తగా పుట్టే వేరియంట్లను సైతం తట్టుకునేలా .. మానవులు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే మార్గంగా కనిపిస్తోంది.
Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు