Viral Video: మీరు క్రికెట్ ఆడతారా? క్రికెట్‌లో మీరు బెస్ట్ ఫీల్డరా? క్యాచ్‌లు బాగా పడతారా? అయితే మీరూ గిన్నిస్ రికార్డ్ కొట్టేయొచ్చు. అవును క్యాచ్ పడితే గిన్నిస్ రికార్డ్ ఇస్తారా? అనే అనుమానాలు ఏమొద్దు. 620 అడుగుల నుంచి విసిరిన ఫుట్‌బాల్‌ను క్యాచ్‌ పట్టుకోవడంతో ఇద్దరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు.






ఇలా సాధించారు


అమెరికా జాతీయ ఫుట్‌బాల్‌ లీగ్‌ మాజీ కీడ్రాకారుడు, ఆయన కాలేజీ ఫుట్‌బాల్‌ టీం కోచ్‌ కలిసి గిన్నిస్ రికార్డ్ సాధించారు. 2021 ఏప్రిల్‌ 23న ఆరిజోనాలో ఈ అరుదైన ఫీట్‌ జరిగింది. టస్కాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజోనా ఫుట్‌బాల్‌ స్టేడియంలో ఈ ఘనత సాధించారు.


రాబ్ గ్రోంకోవ్‌స్కీ చివరిగా ఒక గ్రేట్‌ క్యాచ్‌ చేసి చరిత్ర సృష్టించాలని నిర్ణయించారు. హెలికాప్టర్‌ నుంచి 620 అడుగుల ఎత్తు (188.9 మీటర్లు) నుంచి విసిరిన ఫుట్‌బాల్‌ను రాబ్ గ్రోంకోవ్‌స్కీ పట్టుకుని.. గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు.


వైరల్ 


గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ఇటీవల ఈ వీడియోను తన అధికార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరోవైపు నెటిజన్లు మాత్రం ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.


ఇలాంటి క్యాచ్‌లు చిన్నప్పుడే క్రికెట్‌లో పట్టామని కొందరూ, అంత ఎత్తు నుంచి క్యాచ్‌ పట్టడం చాలా ఈజీ అని మరికొందరు కామెంట్ చేశారు.


Also Read: Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- 39 మంది మృతి


Also Read: Maharashtra Crisis: డిప్యుటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండేకు ఛాన్స్ రానుందా, మహా రాజకీయాల్లో తరవాతి మలుపేంటి?