Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఓ మహిళ అయి ఉంటే, ఆయన ఉక్రెయిన్‌పై యుద్ధం చేసి ఉండేవారు కాదని బోరిస్ జాన్సన్ అన్నారు.
ఉక్రెయిన్‌పై
మరోవైపు రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రం చేసింది. ఇటీవల జీ7 దేశాల అధినేతల భేటీ జరుగుతున్న వేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై రష్యా విరుచుకుపడింది. పోల్తోవా ప్రాంతంలోని క్రెమెన్‌చుక్ నగరంలో ఉన్న షాపింగ్ మాల్‌పై సోమవారం క్షిపణులతో దాడి చేసింది. ఆ సమయంలో 1000కు పైగా పౌరులు ఆ ప్రాంతంలో ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
ఈ దాడిలో 10 మంది పౌరులు మృతి చెందారని, 40 మందికి పైగా గాయాలయ్యాయని, ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య ఇంకా భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇంకెన్నాళ్లు
దాదాపు నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగేలా ఉందని ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి (నాటో) సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్ బర్గ్ అంచనా వేశారు. యుద్ధానికి ముగింపు ఎప్పుడనేది ఎవరికీ తెలియదన్నారు. ఇది కొన్నేళ్లపాటు కొనసాగుతుందనుకుని సిద్ధపడాలన్నారు.
ఇంధన, ఆహార ధరలకు కళ్లెం వేయడానికి వీలుగా ఉక్రెయిన్‌కు సాయం అందించాలని సభ్య దేశాలను కోరారు. 2014లో క్రిమియాను ఆక్రమించుకున్న రీతిలోనే ఉక్రెయిన్ విషయంలో రష్యా చేస్తే తాము మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.
Also Read: Maharashtra Political Crisis: 'కాస్త పంపించండి, ఓటేసి వస్తాం'- సుప్రీంలో పిటిషన్ వేసిన ఆ ఇద్దరు
Also Read: Udaipur Murder Case: 'ఉదయ్‌పుర్' హంతకులను వెంటాడి పట్టుకున్న పోలీసులు- వీడియో చూశారా?