Maharashtra Political Crisis: మహారాష్ట్ర సంక్షోభం గురువారం బలపరీక్షతో క్లైమాక్స్ చేరేటట్లు కనిపిస్తోంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో గురువారం బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగవత్ సింగ్ కోష్యారి కోరారు. దీంతో ప్రస్తుతం జైలులో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మమ్మల్ని పంపండి
అసెంబ్లీలో గురువారం జరిగే బలపరీక్షకు హాజరై, ఓటు వేసేందుకు అనుమతి కోరుతూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సుప్రీంలో పిటిషన్ వేశారు. వారి అభ్యర్థలను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
వీరిద్దరూ మనీలాండింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నేరాలకు పాల్పడ్డారని, ప్రస్తుతం జైలులో ఉన్నారని న్యాయవాది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం 11 గంటలకు జరుగనున్న మహారాష్ట్ర శాసనసభ బలపరీక్షలో ఇద్దరు నేతలు పాల్గొనాలని ఉందని తెలిపారు.
గవర్నర్ ఆదేశం
5 గంటల లోపు
గురువారం సాయంత్రం 5 గంటల లోపు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని ఆదేశించారు. శివసేన పార్టీలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో బలపరీక్ష అనివార్యమైంది.
Also Read: Udaipur Murder Case: 'ఉదయ్‌పుర్' హంతకులను వెంటాడి పట్టుకున్న పోలీసులు- వీడియో చూశారా?
Also Read: Intelligence Alert: ఆ 2 రాష్ట్రాలకు భారీగా బలగాలు- అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా హెచ్చరిక