Intelligence Alert: ఉదయ్‌పుర్‌లో టైలర్ హత్య దేశవ్యాప్తంహా సంచలనం సృష్టించింది. దీంతో కేంద్ర అప్రమత్తమైంది. రాజస్థాన్‌లో శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచింది. అయితే తాజాగా ఇంటిజెన్స్ అలర్ట్ వచ్చింది.


మహారాష్ట్రతో పాటు రాజస్థాన్‌లో హింస, అల్లర్లు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా సంస్థ హెచ్చరించింది. దీంతో సీఆర్‌పీఎఫ్‌ 15 బెటాలియన్ల ర్యాపిడ్‌ ఫోర్స్‌ (RAF)ను సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 20 వేల మంది జవాన్లు ఎయిర్‌లిఫ్ట్‌కు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


కీలక ఆదేశాలు


బెటాలియన్లలో అల్లర్లను అడ్డుకునేందుకు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన మేరకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వెంట తీసుకెళ్లాలని చెప్పినట్లు సమాచారం.


అలాగే వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కంపెనీ కమాండర్‌, కమాండెంట్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.


ఇదీ జరిగింది


మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. రాజస్థాన్ ఉదయ్‌పుర్‌ మాల్దాస్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.


ఉగ్ర సంస్థ ఐసిస్ ముష్కరులను తలపించేలా టైలర్ గొంతు కోసి క్రూరంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  భాజపా సస్పెండ్‌ చేసిన నుపుర్‌ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామని హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలానే చేస్తామని హెచ్చరించారు.


వెంటనే అరెస్ట్


ఈ దారుణానికి తెగబడిన నిందితులను రియాజ్‌ అక్తర్‌, గౌస్‌ మొహమ్మద్‌గా పోలీసులు గుర్తించారు. రియాజ్‌.. టైలర్ గొంతు కోయగా, గౌస్‌ దీనిని అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు.


మరోవైపు సీఎం అశోక్‌ గహ్లోత్ సహా పోలీస్‌ శాఖ నిందితుల వీడియోలను వైరల్‌ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుక సహకరించాలని కోరారు.


Also Read: Viral Video: ఏం దూకినవ్, హార్ట్ బీట్ పెంచేసినవ్ లే- 70 ఏళ్ల బామ్మ జంప్!


Also Read: Udaipur Murder Case: ఉదయ్‌పుర్ హత్య కేసు నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు