Corona Cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 14,506 కరోనా కేసులు నమోదయ్యాయి. 30 మంది మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 11,574 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ రేటు 98.56 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.23 శాతం ఉన్నాయి. 

Continues below advertisement







  • మొత్తం కరోనా కేసులు: 4,34,33,345

  • మొత్తం మరణాలు: 5,25,077

  • యాక్టివ్​ కేసులు: 99,602

  • మొత్తం రికవరీలు: 4,28,08,666


వ్యాక్సినేషన్







దేశంలో తాజాగా 13,44,788 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,46,57,138 కోట్లకు చేరింది. మరో 4,33,659 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.


Also Read: Udaipur Murder Case: ఉదయ్‌పుర్ హత్యతో ఉలిక్కిపడిన దేశం- రంగంలోకి NIA, నెల రోజులు 144 సెక్షన్!


Also Read: Maharashtra Political Crisis: బలపరీక్షను వాయిదా వేయాలని సుప్రీంలో పిటిషన్- విచారణకు ఓకే చెప్పిన కోర్టు