Maharashtra Political Crisis: గురువారంతో ఎండ్ కార్డ్ పడుతుందనకున్న మహారాష్ట్ర రాజకీయంలో మరో ట్విస్ట్ నెలకొంది. బలనిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ ఆదేశించడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది శివసేన. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కోరింది.
ఈ మేరకు శివసేన నేత సునీల్ ప్రభు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బలనిరూపణ ఆదేశాలకు సంబంధించిన డాక్యుమెంట్లు లేకుండా ఎలా విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీంతో సాయంత్రంలోగా అందజేస్తామని శివసేన తరుపు లాయర్లు తెలిపారు. అయితే సాయంత్రం 5 గంటలకు విచారణ చేపడతామని సుప్రీం వెల్లడించింది.
గవర్నర్ ఆదేశాలు
గురువారం సాయంత్రం 5 గంటలకు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని ఆదేశించారు. శివసేన పార్టీలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో బలపరీక్ష అనివార్యమైంది.
Also Read: Maharashtra Political Crisis: క్లైమాక్స్ చేరిన మరాఠా రాజకీయం- అసెంబ్లీలో గురువారమే బలపరీక్ష