Maharashtra Political Crisis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు భావోద్వేగపూరితమైన ఓ లేఖ రాశారు. ఎమ్మెల్యేలు అందరూ వెంటనే ముంబయికి తిరిగి రావాలని కోరారు. రెబల్ క్యాంప్ పట్ల తాను కొన్ని రోజులుగా ఆవేదనగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ముంబయికి
మరోవైపు 50 మంది ఎమ్మెల్యేలతో ముంబయి వస్తున్నట్లు శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు.
" బాలాసాహెబ్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. నాతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాదే నిజమైన శివసేన. త్వరలోనే ముంబయి వెళ్తున్నాం. మా అధికార ప్రతినిధిగా దీపక్ కేసార్కర్‌ను నియమించాం. ఆయనే అన్ని విషయాలను వివరిస్తారు. "
Also Read: Maharashtra Political Crisis: 'మాదే అసలైన శివసేన'- 50 మంది ఎమ్మెల్యేలతో ముంబయికి షిండే!