Udaipur Murder Case: రాజస్థాన్ ఉదయ్‌పుర్ హత్య కేసులో నిందితులకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు తెలిసింది. టైలర్ తల నరికి చంపిన కేసులో ఇద్దరు నిందితులకూ పాక్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్నట్లు అధికారులు తెలిపారు.
దావత్-ఎ-ఇస్లామీతో లింక్
టైలర్ కన్హయ్య లాల్‌ను హత్య చేసిన హంతకులను గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ ఖంజీపీర్‌లోని ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నారు. భిల్వారాకు చెందిన రియాజ్ ఖాన్జీపీర్ ఉదయపుర్‌లో అద్దెకు ఉండగా, గౌస్ రాజస్మాండ్‌లోని భీమా ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. వారి మూలాల ప్రకారం నిందితులు ఇద్దరికీ పాకిస్థాన్‌లోని ఒక ముస్లిం ఛాందసవాద సంస్థ దావత్-ఎ-ఇస్లామీతో సంబంధాలున్నాయి.
ఇదీ జరిగింది
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. రాజస్థాన్ ఉదయ్‌పుర్ మాల్దాస్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
ఉగ్ర సంస్థ ఐసిస్ ముష్కరులను తలపించేలా టైలర్ గొంతు కోసి క్రూరంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భాజపా సస్పెండ్ చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామని హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలానే చేస్తామని హెచ్చరించారు.
వెంటనే అరెస్ట్
ఈ దారుణానికి తెగబడిన నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్‌గా పోలీసులు గుర్తించారు. రియాజ్.. టైలర్ గొంతు కోయగా, గౌస్ దీనిని అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు.
మరోవైపు సీఎం అశోక్ గహ్లోత్ సహా పోలీస్ శాఖ నిందితుల వీడియోలను వైరల్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుక సహకరించాలని కోరారు.
Also Read: Udaipur Murder Case: ఉదయ్‌పుర్ హత్యతో ఉలిక్కిపడిన దేశం- రంగంలోకి NIA, నెల రోజులు 144 సెక్షన్!
Also Read: Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- 30 మంది మృతి