Corona Cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. కొత్తగా 18,819 కరోనా కేసులు నమోదయ్యాయి. 39 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా 13,827 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


రికవరీ రేటు 98.55 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.24 శాతం ఉన్నాయి. 







  • మొత్తం కరోనా కేసులు: 4,34,52,164

  • మొత్తం మరణాలు: 5,25,116

  • యాక్టివ్​ కేసులు: 1,04,555

  • మొత్తం రికవరీలు: 4,28,22,493


వ్యాక్సినేషన్







దేశంలో కొత్తగా 14,17,217 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,61,91,554 కోట్లకు చేరింది. మరో 4,52,430 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.


Also Read: Maharashtra Crisis: డిప్యుటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండేకు ఛాన్స్ రానుందా, మహా రాజకీయాల్లో తరవాతి మలుపేంటి?


Also Read: Husband For Hire: మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య, రోజుకు రూ.3 వేలు ఆదాయం!