UK Ministers Resign: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు మరో షాక్ తగిలింది. ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. భారత మూలాలున్న రిషి సునక్‌తో పాటు పాక్ మూలాలున్న ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్.. తమ మంత్రిత్వశాఖలకు రాజీనామా చేశారు. రిషి.. ఆర్థిక మంత్రిగా, సాజిద్ ఆరోగ్య మంత్రిగా ఇప్పటివరకు పనిచేశారు.
ఎందుకిలా?
పార్టీ గేట్ మొదలుకుని పలు ఆరోపణలు, సమస్యలతో జాన్సన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి సమయంలో ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేయడం వల్ల ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉందని జాన్సన్ సర్కార్ భయపడుతోంది. ప్రధాని నాయకత్వంపై నమ్మకం కోల్పోయామంటూ ఆయనకు రాసిన రాజీనామా లేఖల్లో మంత్రులిద్దరూ పేర్కొన్నారు.
జాన్సన్ నేతృత్వంలో పరిస్థితులు మెరుగు పడే అవకాశాలు ఏ మాత్రమూ లేవని అందుకే రాజీనామా చేస్తున్నట్లు సాజిద్ చెప్పారు.
పార్టీ కొంపముంచిందా?
కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో అధికార నివాసంలో మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలపై జాన్సన్ ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపై ఆయన ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత పార్టీలో కూడా ఆయనకు మద్దతు తగ్గిపోతూ వచ్చింది.
Also Read: Covid Update: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- మహారాష్ట్రలో వైరస్ విజృంభణ
Also Read: Maharashtra Politics: ఆటో స్పీడ్‌కి బెంజ్ వెనకబడిపోయింది, షిందే-ఠాక్రే మధ్య మాటల యుద్ధం