Covid Update: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే మళ్లీ పెరిగింది. కొత్తగా 16,159 కరోనా కేసులు నమోదయ్యాయి. 28 మంది మృతి చెందారు. తాజాగా 15,394 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.53 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.26 శాతంగా ఉంది.
- డైలీ పాజిటివిటీ రేటు: 3.56 శాతం.
- మొత్తం మరణాలు: 5,25,270
- యాక్టివ్ కేసులు: 1,15,212
- మొత్తం రికవరీలు: 4,29,07,327
మహారాష్ట్ర
మహారాష్ట్రలో కొత్తగా 3,098 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. క్రితం రోజుతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 104 శాతం పెరిగింది.
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 9,95,810 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,20,86,763కు చేరింది. మరో 4,54,465 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Maharashtra Politics: ఆటో స్పీడ్‌కి బెంజ్ వెనకబడిపోయింది, షిందే-ఠాక్రే మధ్య మాటల యుద్ధం